- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లైఫ్ ఇచ్చిన హొంబలేకే షాకిచ్చిన రిషబ్ శెట్టి.. హాట్ టాపిక్‌గా మారిన వ్యవహారం
రిషబ్ శెట్టి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వరుసగా తోటి నటీనటులను, నిర్మాణ సంస్థలను అన్‌ఫాలో చేయడం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది.

దిశ, సినిమా: కన్నడ చిత్ర పరిశ్రమలో సెన్సేషనల్ హీరోగా పేరు తెచ్చుకున్న రిషబ్ శెట్టి, ప్రస్తుతం తన వ్యక్తిగత నిర్ణయాలతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్స్ ఒకరినొకరు ఫాలో అవ్వడం సహజం, కానీ రిషబ్ శెట్టి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వరుసగా తోటి నటీనటులను, నిర్మాణ సంస్థలను అన్‌ఫాలో చేయడం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. ముఖ్యంగా ‘కాంతార’ సినిమాతో తనకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టిన హోంబలే ఫిల్మ్స్ సంస్థను, అలాగే ఆ చిత్రం హీరోయిన్ రుక్మిణి వసంత్‌ను ఆయన అన్‌ఫాలో చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతటితో ఆగకుండా, తన ప్రాణ స్నేహితుడు రాజ్ బి శెట్టిని కూడా జాబితా నుంచి తొలగించారు.
మొన్నటి వరకు హోంబలే అధినేత విజయ్ కిరగందూర్‌ను ఫాలో అయిన రిషబ్, ఇప్పుడు ఆయనను కూడా అన్‌ఫాలో చేయడంతో.. ఆ నిర్మాణ సంస్థతో రిషబ్‌కు గట్టి విభేదాలు ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు గుప్పుమంటున్నాయి. ప్రస్తుతం ఆయన కేవలం తన భార్య ప్రగతి శెట్టి, తన సొంత బ్యానర్ రిషబ్ శెట్టి ఫిల్మ్స్, తన సేవా సంస్థ రిషబ్ శెట్టి ఫౌండేషన్ ఖాతాలను మాత్రమే ఫాలో అవుతున్నారు. వ్యక్తిగత విషయాలు పక్కన పెడితే, వృత్తిపరంగా రిషబ్ శెట్టి కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉంది. టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘జై హనుమాన్’ చిత్రంలో ఆయన ఒక పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. దీంతో పాటుగా భారతీయ వీర పుత్రుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న ‘ది ప్రైడ్ ఆఫ్ భారత్’ సినిమాలోనూ ఆయన నటిస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్టులతో రిషబ్ శెట్టి పాన్ ఇండియా స్థాయిలో మరోసారి తన సత్తా చాటడానికి సిద్ధమవుతున్నారు.






