Rukmini Vasanth: రుక్మిణి వసంత్‌తో విభేదాలు.. అన్‌ఫాలో చేసి షాకిచ్చిన రిషబ్ శెట్టి

by Mallepaka Hamsa |

రుక్మిణి వసంత్, తన ప్రాణ స్నేహితుడు, నటుడు రాజ్ బి శెట్టిని కూడా రిషబ్ తన ఫాలోయింగ్ లిస్ట్ నుంచి తొలగించారు.

Rukmini Vasanth: రుక్మిణి వసంత్‌తో విభేదాలు.. అన్‌ఫాలో చేసి షాకిచ్చిన రిషబ్ శెట్టి
X

దిశ, సినిమా: బాక్సాఫీస్ వద్ద శివతాండవం ఆడుతూ ₹850 కోట్లకు పైగా వసూళ్లతో ప్రభంజనం సృష్టించిన రిషబ్ శెట్టి, ఇప్పుడు తన సోషల్ మీడియా నిర్ణయాలతో ఇండస్ట్రీలో ఒక పెద్ద భూకంపమే సృష్టించారు. ‘కాంతార: చాప్టర్ 1’ సక్సెస్ ఎంజాయ్ చేయాల్సిన సమయంలో, తనను గ్లోబల్ స్టార్‌ను చేసిన నిర్మాణ సంస్థతో పాటు, తోటి నటీనటులను కూడా ఆయన అన్‌ఫాలో చేయడం ఇప్పుడు టాలీవుడ్, శాండల్‌వుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రిషబ్ శెట్టిని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసిన హోంబలే ఫిల్మ్స్ అధికారిక ఖాతాను ఆయన అన్‌ఫాలో చేయడం అందరినీ షాక్‌కు గురిచేసింది. అయితే ఇందులో ఒక ట్విస్ట్ ఉంది. సంస్థ పేజీని అన్‌ఫాలో చేసిన రిషబ్, ఆ సంస్థ అధినేత విజయ్ కిరగందూర్ వ్యక్తిగత ఖాతాను మాత్రం ఫాలో అవుతున్నారు. అంటే, నిర్మాణ సంస్థతో ఏదో విషయంలో విభేదాలు వచ్చినా, బాస్‌తో మాత్రం సంబంధాలు బాగానే ఉన్నాయని అర్థమవుతోంది. బహుశా భవిష్యత్తు ప్రాజెక్టుల విషయంలో ఏవైనా మనస్పర్థలు వచ్చి ఉండవచ్చని టాక్.

కేవలం ప్రొడక్షన్ హౌస్‌నే కాకుండా, తన సినిమాలో హీరోయిన్‌గా నటించిన రుక్మిణి వసంత్, తన ప్రాణ స్నేహితుడు, నటుడు రాజ్ బి శెట్టిని కూడా రిషబ్ తన ఫాలోయింగ్ లిస్ట్ నుంచి తొలగించారు. ముఖ్యంగా రాజ్ బి శెట్టితో రిషబ్‌కు ఉన్నస్నేహ బంధం దెబ్బతిన్నట్లు కనిపిస్తోంది. ఇటీవల జరిగిన కొన్ని ఇంటర్వ్యూలలో కూడా ఒకరి గురించి ఒకరు ప్రస్తావించకపోవడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూర్చుతోంది. ఈ విషయంపై సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. అసలు వీరి గొడవలకు కారణాలేంటో ఆరా తీస్తున్నారు. కాగా.. రిషబ్ శెట్టి ఇప్పుడు కేవలం కన్నడ స్టార్ మాత్రమే కాదు, పాన్ ఇండియా లెవల్లో బిజీ అయ్యారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ‘జై హనుమాన్’ చిత్రంలో ఆయన నటిస్తున్నారు. ఈ క్రమంలో ఇతర భాషల చిత్రాలపై దృష్టి పెట్టడం, హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై సినిమాలు చేయకపోవడం వల్లే ఈ విభేదాలు మొదలయ్యాయని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Next Story