- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Rhea Chakraborty : నన్ను ఒక హంతకురాలిగా చిత్రీకరించారు.. రెండేళ్లు నరకం చూశా
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానంతరం తనను లేబుల్ చేసిన వ్యక్తులను గుర్తుచేసుకుంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది రియా చక్రవర్తి.

దిశ, సినిమా: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానంతరం తనను లేబుల్ చేసిన వ్యక్తులను గుర్తుచేసుకుంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది రియా చక్రవర్తి. MTV రోడీస్ సీజన్ 19 ‘కర్మ యా కాంద్’ తాజా ఎపిసోడ్‌లో కనిపించనున్న నటి.. గ్యాంగ్ లీడర్‌లలో ఒకరిగా ఈ షోతో టీవీలోకి తిరిగి రానుండటం ఆనందంగా ఉందని చెప్పింది. ఈ క్రమంలోనే తాను గతంలో అనుభవించిన పోరాట రోజుల గురించి మాట్లాడుతూ.. సుశాంత్ చనిపోయిన తర్వాత రెండేళ్లపాటు గడ్డు కాలాన్ని ఎదుర్కోవాల్సి వచ్చిందని ఎమోషనల్ అయింది.
‘ప్రజలు నాకు చాలా విషయాలు చెప్పారు. నన్నే హంతకురాలిని చేసేందుకు చాలా ఆరోపణలు చేశారు. అయితే ఇతరులు నా గురించి ఏమి చెబుతున్నారనే దాని గురించి ఆలోచిస్తూ కూర్చోలేదు. అన్నింటినీ బలంగా ఖండించాను. ముఖాలు తెలియని వ్యక్తుల కారణంగా నా జీవితాన్ని ఎందుకు ముంగిచుకోవాలి. అలా ఎప్పటికీ చేయను’ అంటూ పలు విషయాలపై మాట్లాడింది.
- Tags
- Rhea Chakraborty






