Sonakshi Sinha ప్రియుడితో తిరుగుతున్న Rhea Chakraborty.. షాక్‌లో సుశాంత్ ఫ్యాన్స్

by Disha Web Desk 17 |
Sonakshi Sinha ప్రియుడితో తిరుగుతున్న Rhea Chakraborty.. షాక్‌లో సుశాంత్ ఫ్యాన్స్
X

దిశ, సినిమా: బీ టౌన్ యంగ్ బ్యూటీ రియా చక్రవర్తి మరొకరితో ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. నటుడు సుశాంత్ సింగ్ మరణంతో వివాదాల్లో చిక్కుకున్న ఆమె ప్రస్తుతం బంటీ సజ్‌దేహ్‌తో డేటింగ్ చేస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. సీమా సజ్‌దే సోదరుడైన బంటీ.. ఫ్యాషన్ డిజైనింగ్, స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్ విభాగాలకు చెందిన పలు అతిపెద్ద సంస్థల్లో భాగస్వామిగా కొనసాగుతున్నాడు. అయితే కొంతకాలంగా ఒకరినొకరు రెగ్యులర్‌గా కలుసుకోవడంతోపాటు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి.

అంతేకాదు 'రియా కొంతకాలంగా ఊహించని కష్టాలు ఎదుర్కొంటోంది. అలాంటి క్రిటికల్ టైమ్‌లో బంటీ తనకు ఎంతో మద్దతునిచ్చాడు. రియా పలు ట్రయల్స్‌కు హాజరైనప్పుడు బంటీ ఆమెకు అండగా నిలబడ్డాడు. వాళ్లను కలిసి చూడటం చాలా ఆనందంగా ఉంది' అని సన్నిహితులు చెప్పినట్లు ఓ ప్రముఖ సైట్ రాసుకొచ్చింది.

అలాగే అక్టోబరు 7న బంటీ పుట్టినరోజు వేడుకలో రియా దర్శనమిచ్చిందని, వారు ప్రస్తుతం కలిసి ఉన్న విషయాన్ని ప్రైవేట్‌గా ఉంచాలనుకుంటున్నట్లు సమాచారం. కాగా బంటీ గతంలో నటి సోనాక్షి సిన్హాతో డేటింగ్‌ చేసినట్లు వార్తలోచ్చాయి.

Read more:

ముఖం దాచుకుని ఒళ్లంతా చూపించిన నటి (వీడియో)

అషు రెడ్డి కాళ్లు నాకిన RGV.. అదే ఫైర్‌లో తనివితీరా ముద్దుపెట్టిన భామ.. వీడియో వైరల్

Next Story