‘స్పిరిట్’ అప్డేట్‌పై ఆర్జీవీ షాకింగ్ రియాక్షన్.. పోస్ట్‌తో బిగ్ ట్విస్ట్ ఇచ్చాడుగా!

by Mallepaka Hamsa |

డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) వివాదాస్పద పోస్టులు పెడుతూ నిత్యం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంటాడు.

‘స్పిరిట్’ అప్డేట్‌పై ఆర్జీవీ షాకింగ్ రియాక్షన్.. పోస్ట్‌తో బిగ్ ట్విస్ట్ ఇచ్చాడుగా!
X

దిశ, సినిమా: డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) వివాదాస్పద పోస్టులు పెడుతూ నిత్యం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంటాడు. తనదైన శైలిలో అభిమానులతో ముచ్చటిస్తూ.. వార్తల్లో నిలుస్తున్నారు. ఆయన పెట్టిన ఎలాంటి పోస్ట్ అయినప్పటికీ క్షణాల్లో వైరల్ అవుతుందనడంలో అతిశయోక్తి లేదు. తన అభిప్రాయాన్న కూడా వెరైటీగా చెప్తూ ఒక్కోసారి ట్రోల్స్ ఎదుర్కొంటాడు. అయినప్పటికీ అవన్నీ పట్టించుకోకుండా. తన మనసులో ఏముందో నిర్మోహమాటంగా చెప్తుంటాడు. తాజాగా, ఆర్జీవీ ఓ పోస్ట్‌తో అందరికీ బిగ్ ట్విస్ట్ ఇచ్చాడనే చెప్పాలి. అసలు ఏం జరిగిందంటే.. ప్రభాస్(Prabhas), సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga)కాంబినేషన్‌లో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ ‘స్పిరిట్’. ఇక ఇటీవల డార్లింగ్ పుట్టినరోజు రావడంతో మూవీ మేకర్స్ ఇందులోంచి చిన్న గ్లింప్స్ రిలీజ్ చేశారు.

ఇక ఈ అప్డేట్‌పై ఆర్జీవీ క్రేజీ పోస్ట్ పెట్టాడు. ఈ గ్లింప్స్‌పై ఆర్జీవీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ.. ‘‘సందీప్ రెడ్డి వంగా నాకు నీ మంచి అలవాట్ల గురించి అలాగే ప్రభాస్ చెడ్డ అలవాట్ల గురించి తెలుసు.. మీ ఇద్దరి స్పిరిట్‌కు హృదయపూర్వక అభినందనలు’’ అని రాసుకొచ్చాడు. అయితే ఈ పోస్ట్ చూసిన వారంతా ఈ సినిమాలో ఆర్జీవీ కూడా భాగం అయ్యారా అందుకే? అలాంటి పోస్ట్ పెట్టారా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి బిగ్ ట్విస్ట ఇచ్చేలా ఉన్నారని కామెంట్లు పెడుతున్నారు. అయితే ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న సినిమాలోంచి ఎన్నో అప్డేట్స్ వచ్చినప్పటికీ సందీప్ రెడ్డి వంగా మాత్రం ఆడియో గ్లింప్స్‌తో ‘స్పిరిట్’లో నటిస్తు్న్న నటీనటులకు సంబంధించిన పేర్లతోనే హైప్ పెంచేశారు.

ఈ అప్డేట్ అభిమానులకు కిక్ ఇచ్చింది. నటీనటుల ముఖాలు చూపించకుండా.. షాట్ లేకుండా వాయిస్ ఓవర్‌తోనే రిలీజ్ చేసినప్పటికీ మంచి రెస్పాన్స్‌ను రాబట్టుకుంది. ప్రస్తుతం ట్విట్టర్‌లో వైరల్ అవుతోంది. కాగా.. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా కనిపించనుంది. అలాగే ప్రకాష్ రాజ్, వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. భారీ అంచనాల మధ్య వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

link

Next Story