మెగా ఫ్యామిలీపై RGV సెటైరికల్ ట్వీట్.. న్యూ పోస్టర్స్‌తో ఉత్కంఠ పెంచుతోన్న వర్మ!

by Dishaweb |
మెగా ఫ్యామిలీపై RGV సెటైరికల్ ట్వీట్.. న్యూ పోస్టర్స్‌తో ఉత్కంఠ పెంచుతోన్న వర్మ!
X

దిశ, వెబ్‌డెస్క్: వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. నిత్యం కాంట్రావర్శీలతో వార్తల్లో ఉండే వర్మ.. ఏపీ ఎన్నికల సమయంలో ‘వ్యూహం’, ‘శపథం’ అనే చిత్రాలను అనౌన్స్ చేసి ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారాడు. వ్యూహం మూవీ షూటింగ్ ఆల్రెడీ స్టార్ చేసిన వర్మ.. ఆ మూవీలోని పాత్రలను రిలీజ్ చేస్తూ వస్తున్నాడు. ఇందులో భాగంగానే 2+2=1 అంటూ చిరంజీవి, పవన్ కళ్యాణ్‌ని పోలిన రెండు క్యారెక్టర్లు ఉన్న ఫొటోను ఇవాళ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో నెటిజన్స్ దీనిపై రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ప్రజారాజ్యం పెట్టినప్పుడు చిరంజీవి రెండు చోట్ల పోటీ చేసి ఒక చోట గెలిచారు. పవన్ జనసేన పార్టీ పెట్టి రెండు చోట్లా ఓడిపోవడంతో ఇలా సెటైరికల్ ట్వీట్ చేశారని కామెంట్లు చేస్తున్నారు. ఇక, ఇటీవల ఈ మూవీ టీజర్‌ను విడుదల చేసి సినిమాపై వర్మ మరింత హైప్ క్రియేట్ చేశాడు.

Next Story

Most Viewed