Pawan Kalyan స్పీచ్‌పై Ram Gopal Varma సంచలన కామెంట్స్

by Chukka Sudharani |   (  Updated:2022-10-26 14:03:50  IST  )

వివాదాలకు కేరాఫ్‌ అడ్డాగా నిలిచిన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

Pawan Kalyan స్పీచ్‌పై Ram Gopal Varma సంచలన కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: వివాదాలకు కేరాఫ్‌ అడ్డాగా నిలిచిన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రతిసారి ఆయన మాటలతో సంచలనం సృష్టిస్తుంటారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో జరిగే సినీ, రాజకీయ పరిణామాలపై తరచుగా స్పందిస్తూ కాంట్రవర్సీకి కేరాఫ్‌గా నిలుస్తారు. తాజాగా ఆయన పవన్ కళ్యాణ్ స్పీచ్‌పై స్పందించారు. ఆయన స్పందించిన తీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటన నేపథ్యంలో అధికార పార్టీ వైసీపీపై విరుచుకు పడ్డ విషయం తెలిసిందే. తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడితే బాగోదని.. చెప్పు చూపించి మరీ వైసీపీ నేతలపై నిప్పులు చెరిగారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ స్పీచ్‌పై ప్రశంసలు కురిపించారు ఆర్‌జీవీ. ''ఆ ప్రసంగం నీతి కొన్ని అంతర్గత వృత్తాలలో అగమ్యగోచరంగా చూడవచ్చు కానీ.. పవన్ కళ్యాణ్ ప్రశంగం నేను గత 100 సంవత్సరాలలో విన్న అత్యంత ప్రభావవంతమైన స్పీచ్'' అంటూ ఆకాశానికి ఎత్తాడు ఈ కాంట్రవర్సీ డైరెక్టర్.

Next Story