‘కల్కి’ ట్రైలర్‌పై ఆర్జీవీ పజిల్.. ఖాలీలను ఫిల్ చేసినవారికి బంపర్ ఆఫర్ ఇస్తానంటూ పోస్ట్!

by Hamsa |   ( Updated:2024-06-22 08:53:15.0  )
‘కల్కి’ ట్రైలర్‌పై ఆర్జీవీ పజిల్.. ఖాలీలను ఫిల్ చేసినవారికి బంపర్ ఆఫర్ ఇస్తానంటూ పోస్ట్!
X

దిశ, సినిమా: నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘కల్కి 2898 ఏడి’. దీనిని వైజయంతి మూవీస్ బ్యానర్‌పై నిర్మాత అశ్వినీదత్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. అయితే ఇందులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దీపికా పదుకొణె జంటగా నటిస్తున్నారు. అలాగే అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ దిశా పటాని కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అయితే ఈ మూవీ విడుదలకు సిద్ధం కావడంతో అందరి దృష్టి కల్కి పైనే ఉంది. జూన్ 27న థియేటర్స్‌లో ఈ సినిమా రిలీజ్ కాబోతుండటంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

అయితే ఇప్పటికే ఇందులోంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైరల్, గ్లింప్స్ అన్ని ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచేశాయి. ఇటీవల కల్కి ప్రీ-రిలీజ్ ఈవెంట్ కూడా జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో.. తాజాగా, మేకర్స్ మరో ట్రైలర్‌ను విడుదల చేసి సినిమాపై మరింత హైప్ పెంచేశారు. దీనికి ఫిదా అయిపోయిన వివాదాస్పద డైరెక్టర్ ఆర్జీవీ ఓ పజిల్ పెట్టి ఆన్సర్ చెప్తే రూ. 1లక్ష ఇస్తానంటూ బంపర్ ఆఫర్‌ను ప్రకటించాడు. ట్విట్టర్ వేదికగా కల్కి ట్రైలర్‌ను షేర్ చేస్తూ.. ఒక సెంటెన్స్ ఇచ్చి కొన్ని వర్డ్స్ మిస్ చేసి ఖాలీల మాదిరిగా ఇచ్చాడు. దానిని ఫిల్ చేసిన వారికి డబ్బులు ఇస్తానని తెలిపాడు. ప్రస్తుతం ఆర్జీవి పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుండగా.. అది చూసిన వారంతా ట్రై చేస్తున్నారు.

Advertisement

Next Story