‘భోళా శంకర్‌’ సినిమా అమ్మాయి కాలి గోటికి కూడా సమానం కాదు: హైపర్ ఆదికి వర్మ కౌంటర్?

by Disha Web Desk 9 |
‘భోళా శంకర్‌’ సినిమా అమ్మాయి కాలి గోటికి కూడా సమానం కాదు: హైపర్ ఆదికి వర్మ కౌంటర్?
X

దిశ, సినిమా: చిరంజీవి అప్ కమింగ్ మూవీ ‘భోళా శంకర్’. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్టు 11న థియేటర్లలో విడుదలకానుంది. కాగా చిత్ర బృందం ప్రమోషన్‌లో భాగంగా తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ శిల్పకళా వేదికలో ఘనంగా నిర్వహించింది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న హైపర్ ఆది ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ప్రతి ఇంట్లో ఫ్యాన్ ఉంటుందో లేదో చెప్పలేము.. కానీ ప్రతి ఇంటికొక మెగాస్టార్ అభిమాని ఉంటాడు. ఆస్తులు సంపాదించడం కంటే అభిమానులను సంపాదించడం మిన్న అనే ధోరణిలోనే చిరంజీవి నడుస్తారు. కానీ అలాంటి వ్యక్తిని అవమానించి మాట్లాడుతున్నారు. మన టాలీవుడ్‌లోనే ఒక డైరెక్టర్ ఉన్నాడు. ఆయనను అనే స్థాయి నాకు లేదు. అలాగని మెగాస్టార్‌, పవర్ స్టార్‌ను అనే స్థాయి ఆయనకు లేదు. చిన్న పెగ్ వేసినప్పుడు మెగాస్టార్‌ను, పెద్ద పెగ్ వేసినప్పుడు పవర్ స్టార్‌ను రకరకాలుగా విమర్శిస్తూ ఉంటారు. నాకు తెలిసి మీరు ఎన్ని పన్నాగాలు పన్నినా బెడిసి కొడతాయి’ అంటూ ఇండైరెక్టుగా రాంగోపాల్ వర్మకు కౌంటర్ ఇచ్చాడు ఆది.

అయితే దీనిపై వెంటనే స్పందించిన రామ్ గోపాల్ వర్మ ఆది మాటలకు కౌంటర్‌గా ఓ ట్వీట్ చేశాడు. ఒక అమ్మాయి కాళ్లను ముద్దు పెడుతూ.. ‘భోళా శంకర్‌’ సినిమా అమ్మాయి కాలి గోటికి కూడా సమానం కాదు’ అని తనదైన స్టైల్‌లో రియాక్ట్ అయ్యాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.

Read More..

అన్న చిరంజీవి మంచోడు కాబట్టి ముంచేశారు.. పవన్ మొండోడు ముంచడాలుండవ్: Hyper Aadi




Next Story