అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి ఉండాలని అభ్యర్థిస్తున్నా: అనిల్ రావిపూడి

by Mallepaka Hamsa |

నా తదుపరి చిత్రం గురించి ఏదైనా అప్‌డేట్ ఉంటే నా అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా మాత్రమే పంచుకుంటాను

అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి ఉండాలని అభ్యర్థిస్తున్నా: అనిల్ రావిపూడి
X

దిశ, సినిమా: వరుస బ్లాక్‌బస్టర్లతో టాలీవుడ్‌లో తిరుగులేని కమర్షియల్ సక్సెస్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన దర్శకుడు అనిల్ రావిపూడి(Anil Ravipudi). సంక్రాంతి అంటే చాలు, బాక్సాఫీస్ వద్ద తనదైన ముద్ర వేయడం ఆయనకు అలవాటుగా మారింది. రీసెంట్‌గా మెగాస్టార్ చిరంజీవితో తీసిన 'మన శంకర ప్రసాద్ గారు'(Mana Shankara Vara Prasad Garu) సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాయడంతో, ఇప్పుడు అందరి కళ్లు ఆయన తదుపరి సినిమాపైనే ఉన్నాయి. వెంకటేష్‌తో తన నెక్ట్స్ ప్రాజెక్ట్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఈ విషయంపై రోజుకో వార్త పుట్టుకొస్తుంది. ఇటీవల ఆయన స్పందించి క్లారిటీ ఇచ్చినప్పటికీ పుకార్లు ఆగడం లేదు.

ఈ క్రమంలో.. తాజాగా, తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి నెట్టింట జరుగుతున్న ప్రచారంపై అనిల్ రావిపూడి మరోసారి సీరియస్ అయ్యారు. ‘‘నా తదుపరి చిత్రం గురించి ఏదైనా అప్‌డేట్ ఉంటే నా అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా మాత్రమే పంచుకుంటాను. దయచేసి మీడియా మిత్రులు ఊహాగానాలు చేయవద్దని, ధృవీకరించని వార్తలను ప్రసారం చేయవద్దని కోరుతున్నాను. తప్పుడు వార్తలు రాయడం వల్ల ప్రాజెక్ట్‌పై అనవసర గందరగోళం ఏర్పడుతుంది. నా కొత్త ప్రాజెక్ట్‌పై అభిమానులు చూపిస్తున్న ఉత్సాహానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందరి మద్దతును మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా.. కానీ అధికార ప్రకటన వచ్చే వరకు సహనంతో వేచి ఉండమని అభ్యర్థిస్తున్నాను’’ అని ఆయన విజ్ఞప్తి చేశారు.

Next Story