రేణూ దేశాయ్ ఎమోషనల్ పోస్ట్ ఆయన కోసమేనా?

by Mallepaka Hamsa |   (  Updated:2022-09-22 08:04:43  IST  )

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్‌కి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 'బద్రి' చిత్రంలో పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించిన ఈమె.. Latest Telugu News

రేణూ దేశాయ్ ఎమోషనల్ పోస్ట్ ఆయన కోసమేనా?
X

దిశ, వెబ్ డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్‌కి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 'బద్రి' చిత్రంలో పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించిన ఈమె.. ఆయననే వివాహమాడి ఆ తర్వాత విడాడులు తీసుకున్న విషయం తెలిసిందే.. కొంత కాలం సినిమాలకు దూరంగా ఉన్న రేణూ ప్రముఖ షోలకు జడ్జ్‌గా వస్తోంది. ప్రస్తుతం మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటిస్తున్న 'టైగర్ నాగేశ్వర రావు' చిత్రంతో మళ్లీ రీఎంట్రీ ఇవ్వనుంది.

అయితే సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను ప్రేక్షకులతో షేర్ చేసుకుంటుంది. తాజాగా, తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఎమోషనల్ పోస్ట్ చేసింది ''2017లో నీతోన్ డ్యాన్స్ స్టార్ మా ఓపెనింగ్ డే కోసం నా మొదటి రోజు షూట్.. నిన్న జరిగినట్టే అనిపిస్తుంది''. అంటూ రాసుకొచ్చింది. అది చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

Next Story