- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Renu Desai:వదిన అని పిలిచినందుకు జానీ మాస్టర్‌కి వార్నింగ్ ఇచ్చిన రేణు దేశాయ్.. వైరల్‌గా మారిన వీడియో!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ (Renu Desai)అందరికీ సుపరిచితమే.

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ (Renu Desai)అందరికీ సుపరిచితమే. గత కొద్ది రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆమె సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ అయింది. మూగ జీవాలకు అండగా..ఉంటూ వాటిని ఎవరు హింసించినా స్ట్రాంగ్‌గానే వార్నింగ్‌లు ఇవ్వడంతో పాటు కేసులు కూడా పెడుతోంది. అలాగే తనను పవన్ కళ్యాణ్ అభిమానులు ఏమైనా అంటే కూడా తనదైన స్టైల్లో కౌంటర్లు వేస్తూ ఉంటుంది. ముఖ్యంగా పవన్‌ను అన్నయ్య అని పిలిచి, తనను వదిన అంటే అస్సలు ఊరుకోదు. గట్టిగానే ఇచ్చిపడేస్తూ ఉంటుంది. ఇలా ఎంతోమంది అని ఆమె కోపానికి బలయ్యారు. ఇక ఇటీవల తన ఇద్దరు పిల్లలు ఆద్య,అకీరా నందన్ పెద్దయ్యాక రెండో పెళ్లి చేసుకుంటానని ప్రకటించింది.
ఇక ఈ వార్తలు ట్రెండింగ్‌లో ఉండగానే.. సన్యాసిగా మారిపోతానని చెప్పి అందరినీ షాక్‌కు గురి చేసింది. ఇదిలా ఉంటే.. రేణు దేశాయ్ మరోసారి సినిమా ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇచ్చింది. ‘16 రోజుల పండగ’ చిత్రంతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. దమ్మాలపాటి హీరోగా పరిచయం అవుతుండగా.. గోపిక ఉదయన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో అనసూయ భరద్వాజ్, వెన్నెల కిషోర్, రేణు దేశాయ్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ప్రదా పిక్చర్స్, సాయి సినీ చిత్ర బ్యానర్స్‌పై మొదటి సినిమాగా ప్రొడక్షన్-1పేరుతో రాబోతుండగా.. సురేష్ కుమార్ దేవత, హరిత దుద్దుకూరు, ప్రతిభ అడివి నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది.
ఈ పూజా కార్యక్రమాలకు ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్(jani master) కూడా హాజరు కాగా.. రేణు దేశాయ్‌ని చూసి వదిన అనేశాడు. ఇక ఆ పదం విన్న వెంటనే కోపంగా..ఎన్ని సార్లు చెప్పాలిరా నీకు వదిన అనకని. పవన్‌తో విడిపోయాక ఆ వరుస ఎలా అవుతా అక్కా అని పిలవండి లేదా రేణు దేశాయ్ అనండి అని వార్నింగ్ ఇచ్చింది. దీంతో వెంటనే జానీ మాస్టర్ చేతులెత్తి దండం పెట్టి పొరపాటున నోటి నుంచి వచ్చేసింది.. ఇంకోసారి అలా పిలవను అని అంటాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక అది చూసిన నెటిజన్లు ప్రతిసారి ఇలా చెప్పాల్సిన పని లేదు.. చూసి చూడనట్టు వదిలేస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.






