- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సంచలన నిర్ణయం తీసుకున్న రేణు దేశాయ్.. సన్యాసిగా మారతానంటూ షాకింగ్ కామెంట్స్
టాలీవుడ్ నటి, పవన్ మాజీ భార్య రేణు దేశాయ్(Renu Desai) సినిమాలకు దూరం అయినప్పటికీ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. జంతువులకు

దిశ, సినిమా: టాలీవుడ్ నటి, పవన్ మాజీ భార్య రేణు దేశాయ్(Renu Desai) సినిమాలకు దూరం అయినప్పటికీ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. జంతువులకు ఏ కష్టం రాకుండా చూసుకుంటున్న ఆమె వాటి కోసం ఇబ్బందులు ఎదురైనా పట్టించుకోవడం లేదు. విరాళాలు కూడబెడుతూ ఓ ట్రస్ట్ ద్వారా జంతువులను రక్షిస్తోంది. ఇక రేణు దేశాయ్ పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. తన పిల్లలను చూసుకుంటూ.. వెకేషన్స్‌కు వెళ్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తోంది.
ఈక్రమంలోనే.. తాను రెండో పెళ్లి కూడా చేసుకుంటానని అందరినీ షాక్‌కు గురి చేసింది. తన పిల్లలు పెద్దయ్యాక కొత్త జీవితాన్ని ప్రారంభిస్తానని చెప్పింది. దీంతో అంతా రేణు దేశాయ్ శుభవార్త ఎప్పుడెప్పుడు చెప్తుందా అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో..తాజాగా, రేణు దేశాయ్ మాత్రం ఊహించని విధంగా అందరినీ ఆశ్చర్యపరిచింది. సంచలన నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో సన్యాసిగా మారతానని పలు కామెంట్లు చేసింది. ‘‘గత రెండేళ్ల క్రితం చాలా విమర్శలు వచ్చాయి. ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. ఎలాంటి పాత్రలోనైనా రాస్తుందని దారుణంగా రాశారు. రెండేళ్లు అవుతున్నా.. నాకు ఏ సినిమాలో అవకాశం రాలేదు.
అలా అని నా గురించి తప్పుగా రాసిన వారు వచ్చి క్షమాపణలు చెప్పరు కదా. నేను నటనను ఇష్టపడినప్పటికీ అదే నా లక్ష్యం కాదు. నేను ఆధ్యాత్మికతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. భవిష్యత్తులో సన్యాసం తీసుకునే అవకాశం ఉంది. సాధన చేయాలనుకుంటున్నాను’’ అని చెప్పుకొచ్చింది. దీంతో ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు పెళ్లి చేసుకుంటానని చెప్పిన రేణు దేశాయ్ సన్యాసం తీసుకోవడం ఏంటి సడెన్‌గా ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుందని పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
READ MORE ......
ఈ ప్రయాణంలో జరిగినవన్నీ ఎప్పటికీ గుర్తుండిపోతాయి.. రష్మిక ఎమోషనల్ పోస్ట్






