Renu Desai: హాస్సిటల్ బెడ్‌పై ఉన్న రేణు దేశాయ్.. ఇది మొదటిసారి అంటూ షాకింగ్ పోస్ట్..

by Mallepaka Hamsa |

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్(Renu Desai) గత కొద్ది కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది.

Renu Desai: హాస్సిటల్ బెడ్‌పై ఉన్న రేణు దేశాయ్.. ఇది మొదటిసారి అంటూ షాకింగ్ పోస్ట్..
X

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్(Renu Desai) గత కొద్ది కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. చివరగా.. ‘టైగర్ నాగేశ్వరరావు’ (Tiger Nageswara Rao)సినిమాలో నటించి మెప్పించింది. కానీ ఆ తర్వాత పెద్దగా అవకాశాలు రాకపోవడంతో గుడ్ బై చెప్పేసింది. ఇక అప్పటి నుంచి జంతు సంరక్షణ, వీధి కుక్కల సంక్షేమం పట్ల ఎంతో శ్రద్ధ వహిస్తోంది. అంతేకాకుండా తన కూతురు ఆద్య పేరుతో ఓ ట్రస్ట్‌ను కూడా ఏర్పాటు చేసింది. అప్పటినుంచి జంతువులకు ఎంతో సాయం చేస్తోంది. అలాగే సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ పలు పోస్టులు షేర్ చేస్తోంది. కొన్నిసార్లు నెటిజన్లను విరాళాలు కూడా అడుగుతోంది.

ఇదిలా ఉంటే.. తాజాగా, రేణు దేశాయ్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ వీడియోను షేర్ చేసింది. ఇక ఇందులో ఆమె హాస్పిటల్‌ బెడ్‌పై కనిపించడంతో సడెన్‌గా చూసిన వారంతా షాక్ అవుతూ.. అయ్యో ఏమైంది మ్యాడమ్ అంటూ ఆందోళన చెందుతున్నారు. మరికొందరు షాక్ అవుతున్నారు. అసలు ఏం జరిగిందంటే.. మూగజీవాలకు సాయం చేస్తున్న సమయంలో రేణు దేశాయ్‌ను గీరడం, కొరకడం వంటివి చేస్తుండటంతో.. ఆమె రేబీస్ టీకాను తీసుకుంది. ఇందుకోసం హాస్పిటల్‌కు వెళ్లిన ఆమె వీడియో రికార్డ్ చేసి ఇన్‌స్టాలో షేర్ చేసింది.

ఇందులో ఏముందంటే.. ‘‘రేబీస్ టెటానస్ వ్యాక్సిన్ తీసుకునేటప్పుడు ఎన్నడూ ఫొటోలు, వీడియోలు తీయలేదు. అసలు ఆ ఆలోచన కూడా రాలేదు. కానీ అందరికీ అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈసారి టీకా తీసుకున్నప్పుడు ఇలా వీడియో రికార్డు చేశాను. ఇలా చేయడం మొదటిసారి. చురుగ్గా రెస్క్యూ పనిలో ఉన్న వ్యక్తులు, పశువైద్యులు తమ టీకా రికార్డులను ఉంచుకోవాలి. వారు సమయానికి ఇంజెక్షన్లు తీసుకుంటున్నారని నిర్ధారించుకోవాలి’’ అనే క్యాప్షన్ జత చేసింది. దీంతో అంతా కాస్త ఊపిరిపీల్చుకుంటున్నారు. అలాగే జాగ్రత్తగా ఉండాలని సలహాలు ఇస్తున్నారు.

Next Story