Akira Nandan ను ఇంట్రడ్యూజ్ చేయనున్న Raghavendra Rao.. క్లారిటీ ఇచ్చిన Renu Desai

by Disha Web Desk 9 |
Akira Nandan ను ఇంట్రడ్యూజ్ చేయనున్న Raghavendra Rao.. క్లారిటీ ఇచ్చిన Renu Desai
X

దిశ, సినిమా: తాజాగా నార్వేలో ‘బాహుబలి’ మూవీని ప్రదర్శించగా మూవీ టీమ్‌‌తో పాటు రేణు దేశాయ్, ఆమె కొడుకు అకీరా నందన్ సందడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ట్రిప్ ముగిశాక దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు.. అకీరతో ఉన్న ఫోటో షేర్ చేసి వెంటనే డిలీట్ చేశాడు. అయితే అంతకు ముందే నెట్టింట ఆ ఫోటో వైరల్ అయిపోయింది. రాఘవేంద్ర రావు, అకీరను లాంచ్ చేస్తున్నాడా? ఆయన యాక్టింగ్‌ స్కూల్‌లోనే జాయిన్ అయ్యాడా? అంటూ నెట్టింట చర్చ జరిగింది. దీంతో రేణు దేశాయ్ స్పందిస్తూ.. ‘అకీరా నందన్ ఏ ఫిల్మ్ స్కూల్‌లో జాయిన్ అవ్వలేదు. అసలు అకీరకి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ లేదు. సినిమాల్లో నటించాలని లేదు. ఒకవేళ ఫ్యూచర్‌లో అలాంటి ఇంట్రెస్ట్ వస్తే.. ఆ విషయాన్ని ముందుగా నేనే ప్రకటిస్తాను’ అని చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి: నన్ను చంపేందుకు లోకేష్ కుట్ర.. ఇదే నా మరణ వాంగ్మూలం: పోసాని సంచలన వ్యాఖ్యలు






Next Story

Most Viewed