ఆ పని చేసిన అకీరా నందన్.. భయంకరంగా ఉందంటూ రేణు దేశాయ్ పోస్ట్

by Disha Web Desk 6 |
ఆ పని చేసిన అకీరా నందన్.. భయంకరంగా ఉందంటూ రేణు దేశాయ్ పోస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గతంలో బద్రి, జానీ సినిమాల్లో కలిసి నటించి ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికి అకిరా, ఆద్య అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుని విడిపోయారు. అప్పటి నుంచి అకీరా నందన్, ఆద్య బాధ్యతలు మొత్తం రేణు దేశాయ్ చూసుకుంటుంది. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటుంది. నిత్యం పలు పోస్టులతో అభిమానులకు దగ్గరగా ఉంటుంది.

తాజాగా, రేణు దేశాయ్ అకీరా నందన్‌కు సంబంధించిన ఓ వీడియోను షేర్ చేసింది. అందులో ఒకప్పుడు తన ఫొటోస్ అందంగా ఎడిట్ చేసి ఉంచండంతో దాన్ని.. తన కొడుకు అకీరా కొన్ని నిమిషాలలో ఈ ఫొటోలను మళ్లీ ఎడిట్ చేశాడు. దానిని రేణు దేశాయ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ వాటిని చూస్తుంటే భయంకరంగా ఉన్నాయంటూ క్యాప్షన్ జత చేసింది. ఈ పోస్ట్‌ను చూసిన నెటిజన్లు అచ్చం సీతలా ఉన్నావంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి: హీరోయిన్ నిత్యామీనన్ ఇంట్లో తీవ్ర విషాదం.. ఎమోషనల్ పోస్ట్ వైరల్

Next Story

Most Viewed