Chiranjeevi , Pawan Kalyan కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన Naveen Polishetty

by Disha Web Desk 7 |
Chiranjeevi , Pawan Kalyan కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన Naveen Polishetty
X

దిశ, సినిమా: తరుచుగా వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్న శ్రీరెడ్డి తాజాగా పవన్ కల్యాణ్, చిరంజీవిపైన మరోసారి వైరల్ ట్వీట్ చేసింది. యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి జంటగా నటించిన తాజా చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. సెప్టెంబర్ 7న తెలుగుతోపాటు తమిళ్‌, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక చాలా రోజుల తరువాత అనుష్క స్క్రీన్‌పై కనిపిస్తుండటంతో అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇకపోతే ఈ మూవీ ప్రమోషన్‌లో భాగంగా నవీన్ రీమేక్ మూవీస్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను శ్రీ రెడ్డి తన ట్విట్టర్‌లో షేర్ చేస్తూ.. ‘రీమేక్ స్టార్ పవన్ కళ్యాణ్, చిరంజీవికి హీరో నవీన్ పొలిశెట్టి స్ట్రాంగ్ కౌంటర్’ అంటూ పేర్కొంది. ఇక ఈ వీడియోలో నవీన్ ఏం అన్నాడు అంటే.. ‘ప్రజెంట్ నా ఫోకస్ అంతా తెలుగు సినిమా మీదనే ఉంది. ఎందుకంటే మన తెలుగు సినిమాలు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నాయి. ప్రేక్షకులు భారీగా సపోర్ట్ చేస్తారు. అందుకని రీమేక్ మూవీస్ చేయను. నాకు చాలా ఆఫర్లు వస్తున్నాయి కానీ నో చెప్పాను. ఎందుకంటే టాలీవుడ్ నుంచి ఒక మంచి సినిమా వచ్చి హిట్ అయితే.. ఆ మూవీ గురించి వేరే ఇండస్ట్రీ వారు మాట్లాడుకుంటారు చూడండి అందులో చాలా కిక్ ఉంటుంది. ఈ హై నాకు చాలా ఇష్టం’ అని చెప్పుకొచ్చాడు.

Next Story