- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కెనీషాతో రిలేషన్.. జయం రవికి ఆర్తి స్ట్రాంగ్ కౌంటర్.. కోలీవుడ్‌లో ముదిరిన విడాకుల రచ్చ!
వేరే వ్యక్తితో తిరగడం గర్వించదగ్గ విషయం కాదు, అది చాలా అసహ్యమైన ప్రవర్తన" అని మండిపడ్డారు.

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో రవి మోహన్ (జయం రవి’, ఆయన మాజీ భార్య ఆర్తి మధ్య విడాకుల వ్యవహారం ఇప్పుడు ఒక పెద్ద వార్‌లా మారిపోయింది. ఇటీవల జయం రవి పురుషుల పక్షాన నిలుస్తూ చేసిన వ్యాఖ్యలకు, ఆర్తి సోషల్ మీడియా వేదికగా అత్యంత ఘాటుగా సమాధానం ఇచ్చారు. వీరిద్దరి మధ్య మాటల యుద్ధం ఇప్పుడు ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. కొద్ది రోజుల క్రితం జయం రవి మాట్లాడుతూ.. "సాధారణంగా విడాకుల విషయంలో అందరూ మహిళలనే బాధితులుగా చూస్తారు. కానీ నిజానికి పురుషులు కూడా బాధితులే, వారు పడే బాధ ఎవరికీ కనిపించదు" అని వ్యాఖ్యానించారు. దీనిపై ఆర్తి వెంటనే రియాక్ట్ అయ్యారు. "ఒకవేళ విడాకులు రాకముందే నేను వేరే వ్యక్తితో కలిసి తిరిగి, మహిళలే బాధితులు అని అంటే సమాజం ఒప్పుకుంటుందా? ఖచ్చితంగా ఒప్పుకోదు. మరి ఒక పురుషుడు అదే పని చేస్తూ, తనే బాధితుడిని అని చెప్పుకుంటుంటే ఎందుకు ప్రశ్నించకూడదు?" అని ఆర్తి ఫైర్ అయింది.
ఇక రవి మోహన్ ప్రవర్తనపై ఆర్తి మరింత ఘాటుగా స్పందిస్తూ.. "వేరే వ్యక్తితో తిరగడం గర్వించదగ్గ విషయం కాదు, అది చాలా అసహ్యమైన ప్రవర్తన" అని మండిపడ్డారు. రవి మోహన్, సింగర్ కెనీషాతో రిలేషన్‌లో ఉన్నారంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల జయం రవి దర్శకత్వం వహిస్తున్న కొత్త సినిమా ప్రారంభోత్సవానికి కూడా కెనీషా హాజరుకావడం, అక్కడ ఆమె స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవడంతో ఆర్తి ఈ స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇక 2009లో పెళ్లి చేసుకున్న ఈ జంట, మనస్పర్థల కారణంగా 2024లో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అప్పటి నుంచి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూనే ఉన్నారు. విడాకుల తర్వాత కూడా వీరి వ్యక్తిగత జీవితం ఇప్పుడు బహిరంగ చర్చకు దారితీసింది.






