మ‌హేశ్- త్రివిక్రమ్ సినిమా షూటింగ్ ప్రారంభం ఎప్పుడంటే..

by Disha Web Desk 6 |
మ‌హేశ్- త్రివిక్రమ్ సినిమా షూటింగ్ ప్రారంభం ఎప్పుడంటే..
X

దిశ, సినిమా : సూపర్ స్టార్ మ‌హేష్‌బాబు, ద‌ర్శకుడు త్రివిక్రమ్ క‌ల‌యిక‌లో ఓ సినిమా రాబోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో మహేశ్‌కు జోడీగా పూజాహెగ్డే న‌టించనుండగా.. త‌మ‌న్ సంగీతం అందించనున్నారు. అయితే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లేది ఎప్పుడా? అని మ‌హేశ్ అభిమానులు చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ నెల 12 నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీని డిఫ‌రెంట్ స్టైల్‌లో ప్లాన్ చేసిన త్రివిక్రమ్.. కామెడీ, ఫ్యామిలీ ఎమోష‌న్ సహా యాక్షన్ కలబోతగా రూపొందించనున్నారు.

దాదాపు రెండు వందల కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కిస్తున్నట్లు వార్తలు వినిపిస్తుండగా.. ఈ ఏడాది చివ‌రిలోగా షూటింగ్‌ పూర్తిచేసి వ‌చ్చే ఏడాది వేస‌విలో సినిమాను రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. కాగా ప్రముఖ తమిళ నటుడు ఈ చిత్రంలో విలన్‌గా కనిపించబోతున్నట్లు సమాచారం.

Also Read : బాడీ ఫిట్‌నెస్ కోసం మహేశ్ బాబు కసరత్తులు..


Next Story