న్యూ ట్రెండ్‌లో మెరిసిన రెజీనా.. టెంప్ట్ చేయడం ఈ థీమ్ ఉద్దేశం కాదంటూ పోస్ట్..

by Disha Web Desk 7 |
న్యూ ట్రెండ్‌లో మెరిసిన రెజీనా.. టెంప్ట్ చేయడం ఈ థీమ్ ఉద్దేశం కాదంటూ పోస్ట్..
X

దిశ, సినిమా: టాలీవుడ్ టాలెంటెడ్ హీరోయిన్లలో రెజీనా కసాండ్రా ఒకరు. ‘శివ మనసులో శృతి’ సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. ‘రొటీన్ లవ్ స్టోరీ, కొత్త జంట, పిల్ల నువ్వు లేని జీవితం, పవర్, రారా.. కృష్ణయ్య, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, శంకర’ వంటి సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకుంది. వీటితో పాటు.. అడవి శేష్ హీరోగా తెరకెక్కిన ‘ఎవరు’ చిత్రంలో రెజీనా నెగిటివ్ షేడ్స్‌లో అదరగొట్టింది. అయితే.. ఇటీవల ఆమెకు కమర్షియల్ చిత్రాల కంటే లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్స్‌లోనే ఎక్కువ ఆఫర్స్ వస్తు్న్నాయి. దీంతో థ్రిల్లర్, హారర్ చిత్రాలకు పెట్టింది పేరుగా మారిపోయింది ఈ అమ్మడు. చివరగా ‘శాకినీ డాకినీ’ చితంతో అలరించింది.

ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది రెజీనా. ఎప్పటికప్పుడూ తన అందాలు చూపిస్తూ గ్లామరస్ ఫొటోలను షేర్ చేస్తుంటోంది. ఈ క్రమంలోనే మరోసారి నెట్టింట అందాల విందు ఏర్పాటు చేసింది. జీన్స్ మిడ్డీ, షర్ట్ ధరించి కాళ్లు అందాలను చూపిస్తూ టెంప్టింగ్ ఫోజులు ఇచ్చింది. అంతే కాకుండా.. ‘ఈ సీజన్‌లో టెంప్ట్ చేయడం ఈ థీమ్ ఉద్దేశం కాదంటూ’ క్యాప్షన్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

Read More..

బిగుతైన అందాలతో ఊపిరి పీల్చుకోనీయకుండా చేస్తున్నా.. మలైకా



Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story