- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మలయాళీలకు రెడ్ కార్పెట్.. తెలుగు వారికి అవమానమా? ఫిలింఫేర్ వివాదంపై స్పందించిన నిహారిక
అవార్డు వేడుకలో మలయాళ పరిశ్రమకు చెందిన కొత్త ఆర్టిస్టులకు మాట్లాడే ఛాన్స్ ఇచ్చారని, కానీ తెలుగు, తమిళ, కన్నడ పరిశ్రమల వారికి ఆ అవకాశం ఇవ్వకుండా అవమానించడం తనను బాధించిందని ఆమె చెప్పారు.

దిశ, సినిమా: మెగా డాటర్, నిహారిక కొణిదెల(Niharika Konidela) ప్రస్తుతం ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. తన నిర్మాణ సంస్థ ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్’ బ్యానర్‌పై వచ్చిన ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ఆమె, ఇప్పుడు తన రెండో ప్రాజెక్ట్ ‘రాకాస’(raakasa)తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. సంగీత్ శోభన్(Sangeet Shobhan) హీరోగా, నయన్ సారిక హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 3న విడుదల కానుంది. తాజాగా ఈ చిత్ర టీజర్ లాంచ్ వేడుకలో నిహారిక పాల్గొని, సినిమా విశేషాలతో పాటు ఇటీవల తాను చేసిన సోషల్ మీడియా పోస్ట్‌పై నెలకొన్న ఫిలింఫేర్ వివాదం గురించి ఓపెన్ అయ్యారు. ఇటీవల జరిగిన ఫిలింఫేర్ అవార్డుల వేడుకలో డెబ్యూట్ డైరెక్టర్స్‌కు (కొత్త దర్శకులకు) స్టేజిపై మాట్లాడే అవకాశం ఇవ్వలేదని నిహారిక సోషల్ మీడియాలో అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
దీనిపై ఆమె తాజాగా క్లారిటీ ఇచ్చారు. అవార్డు వేడుకలో మలయాళ పరిశ్రమకు చెందిన కొత్త ఆర్టిస్టులకు మాట్లాడే ఛాన్స్ ఇచ్చారని, కానీ తెలుగు, తమిళ, కన్నడ పరిశ్రమల వారికి ఆ అవకాశం ఇవ్వకుండా అవమానించడం తనను బాధించిందని ఆమె చెప్పారు. ఒక సినిమా వెనుక దర్శకుడి కష్టం ఎంతో ఉంటుందని, అలాంటిది అవార్డు తీసుకునే సమయంలో కనీసం రెండు ముక్కలు మాట్లాడే అవకాశం లేకపోవడం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు. నిహారిక వరుసగా కొత్త దర్శకులకే ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారని యాంకర్ ప్రశ్నించగా.. దానికి స్పందిస్తూ.. ‘‘నిజం చెప్పాలంటే.. నా దగ్గరకు ఇప్పటికే సక్సెస్ అయిన పెద్ద డైరెక్టర్లు ఎవరూ కథలు చెప్పడానికి రాలేదు. కేవలం కొత్త దర్శకులు మాత్రమే కథలతో నన్ను కలిశారు’’ అని ఆమె క్లారిటీ ఇచ్చారు. తన దగ్గరకు వచ్చిన కొత్త దర్శకుల కథల్లో కంటెంట్ బాగుంటేనే సినిమాలు చేస్తున్నానని, కేవలం కొత్త వారు అన్న కారణంతో కాకుండా ప్రతిభను చూసి అవకాశం ఇస్తున్నట్లు నిహారిక వివరించారు.






