విగ్గుతో సినిమాలను మేనేజ్ చేస్తున్నరెబల్‌స్టార్.. అడ్డంగా బుక్కయ్యాడుగా?(వీడియో)

by Anjali |
విగ్గుతో సినిమాలను మేనేజ్ చేస్తున్నరెబల్‌స్టార్.. అడ్డంగా బుక్కయ్యాడుగా?(వీడియో)
X

దిశ, సినిమా: రెబల్ స్టార్ ప్రభాస్ టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు తెరకెక్కించిన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. గత రెండేళ్లుగా ప్రభాస్ నటించిన సినిమాలన్నీ (ఆదిపురుష్, రాధే శ్యామ్, సాహో) బాక్సాఫీసు వద్ద అట్లర్ ఫ్లాప్‌గా నిలిచాయి. గత ఏడాది చివర్లో తెరకెక్కిన ‘సలార్’ మూవీతో సాలిడ్ హిట్‌ అందుకున్నాడు.

బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లను కొల్లగొట్టిన ఈ సినిమాతో ప్రభాస్ ‘ది రాజా సాబ్’ చిత్రంలో అవకాశం దక్కించుకున్నాడు. సినిమాల విషయం పక్కన పెడితే.. ప్రభాస్ మ్యారేజ్ విషయం విషయం నెట్టింట ఎప్పుడూ హాట్ టాపిక్ గానే నిలుస్తుంది. వివాదాస్పద దర్శకుడు వేణు స్వామి తరచూ రెబల్ స్టార్ పెళ్లి, హెల్త్, సినిమాలపై కామెంట్స్ చేస్తూ ప్రభాస్ ఫ్యాన్స్‌ను టెన్షన్ పెడుతుంటాడు.

ఇకపోతే టాలీవుడ్‌లో మోస్ట్ బ్యాచిలర్‌గా పేరు సంపాదించుకున్న ఈ హీరో జుట్టుకు విగ్గు పెట్టుకుని తిరుగుతన్నాడని ప్రస్తుతం నెట్టింట ఓ వార్త వైరల్ అవుతోంది. ఓ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న రెబల్ స్టార్ జుట్టు సరి చేయడానికి వచ్చిన మేకప్ మ్యాన్‌ను నెక్ట్స్ టైం వచ్చినప్పుడు ఇంటి దగ్గరే గట్టిగా ఫిక్స్ చేసుకుని తీసుకురా అనడంతో ప్రభాస్ విగ్ సీక్రెట్ బయటపడిందంటూ జనాలు కామెంట్లు పెడుతున్నారు. ప్రభాస్ ది రియల్ జుట్టు కాదా? విగ్గుతో సినిమాలను కవర్ చేస్తున్నాడా? అంటూ షాక్ అవుతున్నారు. మరికొంతమందేమో వీడియో సక్కగా చూడండ్రా అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ఈ కామెంట్లను కొట్టిపారేస్తున్నారు.

Read More..

మెగాస్టార్ చిరంజీవి చేతికున్న ఈ సింపుల్ వాచ్ ధరెంతో తెలిస్తే షాక్

Next Story

Most Viewed