- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అతనితో ఒక రాత్రి గడపడానికి రెడీ.. 50 ఏళ్ల వయసులో హీరోయిన్ సంచలన స్టేట్‌మెంట్!
ఒకప్పటి స్టార్ హీరోయిన్ అమీషా పటేల్(Amisha Patel) 50 ఏళ్లు వచ్చినప్పటికీ బ్యాచ్‌లర్ లైఫ్ లీడ్ చేస్తోంది.

దిశ, సినిమా: ఒకప్పటి స్టార్ హీరోయిన్ అమీషా పటేల్(Amisha Patel) 50 ఏళ్లు వచ్చినప్పటికీ బ్యాచ్‌లర్ లైఫ్ లీడ్ చేస్తోంది. పెళ్లి చేసుకోకుండా వరుస చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఎంత బిజీగా ఉన్నప్పటికీ పలు ఇంటర్వ్యూలో పాల్గొంటూ వార్తల్లో నిలుస్తోంది. ఈక్రమంలో.. గత కొద్ది కాలంగా ఈ అమ్మడు పెళ్లి చేసుకోబోతుందని వార్తలు వస్తున్నాయి. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అమీషా పటేల్ ఓ హీరోపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘‘హాలీవుడ్ సూపర్ స్టార్ టామ్ క్రూజ్(Tom Cruise) అంటే నాకు పిచ్చి. ఎవరైనా అతనితో పాడ్‌కాస్ట్ చేయగలిగితే.. దయచేసి నన్ను కూడా పిలవండి. నా చిన్నప్పటి నుంచి నాకు టామ్ క్రూజ్ అంటే చాలా ఇష్టం.
నా ఫైల్స్‌లో కూడా అతని ఫొటో ఉండేది. నా గదిలో ఉన్న ఏకైక పోస్టర్ అతనిదే. టామ్ క్రూజ్ ఎప్పటికీ నా ఫస్ట్ క్రష్. నేను అతని కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఏకంగా అతనితో ఒక రాత్రి గడపడానికి కూడా వెనకాడను. ఒకవేళ నాకు అవకాశం వస్తే పెళ్లి కూడా చేసుకుంటాను. అతనికి అంత పెద్ద అభిమానిని నేను ఎందుకో కారణం తెలియదు. కానీ ఆయన అంటే పడిచచ్చిపోతాను’’ అని అందరికీ షాకిచ్చింది. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన కామెంట్స్ సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. ఈ అమ్మడు అంత ఒపెన్ కావడంతో అంతా షాక్ అవుతూ పలు రకాలుగా స్పందిస్తున్నారు.






