- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రవితేజకు జోడీగా ప్రియ
by Sujitha Rachapalli |
మాస్ మహారాజ్ రవితేజ సినిమాలతో బాక్సాఫీస్‌పై దండయాత్ర చేస్తూనే ఉన్నాడు. ఫెయిల్యూర్స్ అందుకుంటూనే ఉన్నాడు. రీసెంట్‌గా వచ్చిన ‘మాస్ జాతర’ కూడా డిజాస్టర్ కాగా త్వరలో ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అంటూ రాబోతున్నాడు.

X
దిశ, సినిమా : మాస్ మహారాజ్ రవితేజ సినిమాలతో బాక్సాఫీస్‌పై దండయాత్ర చేస్తూనే ఉన్నాడు. ఫెయిల్యూర్స్ అందుకుంటూనే ఉన్నాడు. రీసెంట్‌గా వచ్చిన ‘మాస్ జాతర’ కూడా డిజాస్టర్ కాగా త్వరలో ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అంటూ రాబోతున్నాడు. అయితే ఆ తర్వాత సినిమా కూడా లైన్‌లో పెట్టాడు రవితేజ. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శివ నిర్వాణ డైరెక్ట్ చేయబోతున్నాడు. కాగా ఇందులో లీడ్ హీరోయిన్‌గా కోలీవుడ్ భామను ఎంచుకున్నారు మేకర్స్. టాలెంటెడ్ అండ్ బ్యూటిఫుల్ ప్రియా భవానీ శంకర్ రవితేజ సరసన మెరవబోతుంది. ఇందుకు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ కాగా ఖచ్చితంగా రవితేజకు సరిపోయే కెమిస్ట్రీ అందుతుదంటున్నారు నెటిజన్లు.
Next Story






