రవితేజ తమ్ముని కొడుకు.. మాధవ్ హీరోగా కొత్త సినిమా ప్రారంభం

by sudharani |
రవితేజ తమ్ముని కొడుకు.. మాధవ్ హీరోగా కొత్త సినిమా ప్రారంభం
X

దిశ, సినిమా : టాలీవుడ్ స్టార్ హీరో రవితేజ ఫ్యామిలీ నుంచి మరో యంగ్ హీరో రాబోతున్నాడు. రవితేజ తమ్ముడు రఘు కొడుకు మాధవ్ హీరోగా వస్తున్న ఈ సినిమా గురువారం రామానాయుడు స్టూడియోస్‌లో కే. రాఘవేంద్రరావు, సురేష్ బాబు, బెక్కెం వేణుగోపాల్, చదలవాడ శ్రీనివాసరావు, రఘు తదితరుల ఆశిస్సులతో ఘనంగా ప్రారంభమైంది. ఇక రాఘవేంద్రరావు చేతుల మీదుగా దర్శకనిర్మాతలకు స్క్రిప్ట్‌ను అందజేయగా, సురేష్ బాబు కెమెరా స్విచ్ ఆన్ చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన చిత్ర నిర్మాత జె.జె ఆర్ రవిచంద్.. ‘జేజేఆర్ ఎంటర్‌టైన్మెంట్స్ ఎల్ఎల్పీలో ఈ రోజు ప్రొడక్షన్ నెంబర్ 2 ఓపెనింగ్ జరగడం సంతోషంగా ఉంది. ఈ ఓపెనింగ్ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకు, మీడియా మిత్రులకు కృతజ్ఞతలు’ తెలిపాడు. జేజేఆర్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై శ్రీమతి యలమంచి రాణి సమర్పణలో వస్తున్న చిత్రానికి గౌరీ రోణంకి దర్శకత్వం వహిస్తున్నాడు.

Also Read...

ఆ డైరెక్టర్ మాటలు నన్ను చాలా బాధించాయి: నాని

Next Story

Most Viewed