‘హ‌నుమాన్’ సినిమాలో కోతి చేష్టలు చేయనున్న ర‌వితేజ.. ప్రశాంత్ వర్మ బాగానే ఒప్పించాడుగా..

by Disha Web Desk 7 |
‘హ‌నుమాన్’ సినిమాలో కోతి చేష్టలు చేయనున్న ర‌వితేజ.. ప్రశాంత్ వర్మ బాగానే ఒప్పించాడుగా..
X

దిశ, సినిమా: ఈ సంక్రాంతి బ‌రిలో ‘హ‌నుమాన్’ కూడా నిలిచిన విషయం తెలిసిందే. తేజా స‌జ్జా హీరోగా సూప‌ర్ హీరో హనుమాన్ క‌థాంశంతో మైథ‌లాజిక‌ల్ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా వస్తున్న మూవీని ప్రశాంత్ వ‌ర్మ తెర‌కెక్కించాడు. ఈ చిత్రంతోపాటు ‘గుంటూరు కారం’, ‘ఈగ‌ల్‌’, ‘నా సామిరంగ’ పొంగల్ రేస్‌లో నిలిచి ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేందుకు సిద్ధం అవుతున్నాయి. అయితే తాజాగా ‘హనుమాన్’ మూవీ టీమ్ ఇంపార్టెంట్ అప్‌డేట్ రివీల్ చేసింది. ఈ సినిమాకు ర‌వితేజ వాయిస్ ఓవ‌ర్ ఇచ్చినట్లు తెలిపింది.

కోటి అనే కోతి పాత్రకు గాత్రదానం చేసిన మాస్ మహారాజా ఫుల్‌గా ఎంటర్‌టైన్ చేయనున్నాడని ప్రకటించింది. హీరో ల‌క్ష్యానికి అండ‌గా నిల‌బ‌డే కీల‌కపాత్ర కావ‌డంతో ర‌వితేజ‌తో ప్రశాంత్ వ‌ర్మ టీమ్ వాయిస్ ఓవ‌ర్‌ను చెప్పిన‌ట్లు స‌మాచారం. ర‌వితేజ వాయిస్ ఓవ‌ర్ ఈ సినిమాకు స్పెష‌ల్ అట్రాక్షన్‌గా నిలుస్తుంద‌ని తెలుస్తుండగా.. దాదాపు రూ.75 కోట్ల బ‌డ్జెట్‌తో నిర్మించిన ఈ మూవీ జ‌న‌వ‌రి 12న రిలీజ్ కాబోతుంది.

Next Story

Most Viewed