గూస్ బంప్స్ తెప్పిస్తున్న రవితేజ ‘‘ రావణాసుర’’ ట్రైలర్

by Dishanational2 |
గూస్ బంప్స్ తెప్పిస్తున్న రవితేజ ‘‘ రావణాసుర’’ ట్రైలర్
X

దిశ, వెబ్‌డెస్క్ : మాస్ మహా రాజ రవితేజ రావణాసుర ట్రైలర్ వచ్చేసింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేసింది చిత్ర బృదం. ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా కట్ చేసి విడుదల చేసిన ఈ ట్రైలర్ లో రవితేజ యాక్టింగ్, డైలాగ్స్, హైపర్ ఆది కామెడీ, ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయేలా ఉంది. ఇక ఈ మూవీలో రవితేజ ఓ క్రిమినల్ లాయర్ పాత్రలో కనిపిస్తున్నారు. మర్డర్ చేయడం క్రైమ్.. దొరక్కుండా మర్డర్ చేయడం ఆర్ట్ అంటూ రవితేజ చెప్పే మాస్ డైలాగ్ కి థియేటర్లో విజిల్స్ పడడం పక్కా. ఇక సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అభిషేక్ నామ, రవితేజ కలిసి నిర్మిస్తున్నారు. ఇక సుశాంత్ మొదటిసారి నెగిటివ్ రోల్ లో కనిపించనున్నారు.



Next Story