ఫుల్ స్వింగ్‌లో రవితేజ.. ‘ఇరుముడి’ షూటింగ్ అప్డేట్ వైరల్!

by Mallepaka Hamsa |

తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్లు టాక్. కేవలం నెల రోజులు మాత్రమే షూటింగ్ మిగిలి ఉంది.

ఫుల్ స్వింగ్‌లో రవితేజ.. ‘ఇరుముడి’ షూటింగ్ అప్డేట్ వైరల్!
X

దిశ, సినిమా: మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఇరుముడి’ సినిమాపై ఇప్పుడు ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి. రవితేజ అంటేనే మాస్, యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్, కానీ ఈసారి ఆయన ఒక విభిన్నమైన మార్గంలో వెళ్తున్నారు. ఈ చిత్రంలో మాస్ ఎలిమెంట్స్‌తో పాటు భక్తి , బలమైన కుటుంబ భావోద్వేగాలు కలగలిపి ఉండబోతున్నాయి. రవితేజ ఇందులో ఎప్పుడూ చూడని విధంగా ఒక పవర్ ఫుల్ ఎమోషనల్ పాత్రలో కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకోనున్నారు. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్లు టాక్. కేవలం నెల రోజులు మాత్రమే షూటింగ్ మిగిలి ఉంది. చిత్ర బృందం ఎక్కడా ఆలస్యం చేయకుండా శరవేగంగా పనులను పూర్తి చేస్తోందట.

కాగా.. ఈ సినిమాలో రవితేజ సరసన ప్రియా భవాని శంకర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, వీరిద్దరి జంట తెరపై కొత్తగా ఉంటుందని తెలుస్తోంది. సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి ప్రాణం పోసే మ్యూజిక్ అందిస్తున్నారు, ఆయన ఇచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాలోని ఎమోషన్స్‌ను మరో లెవల్‌కు తీసుకువెళ్తుందని మేకర్స్ ఆశిస్తున్నారు.వరుస విజయాలతో దూసుకుపోతున్న అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఖర్చు విషయంలో వెనుకాడకుండా హై టెక్నికల్ వాల్యూస్‌తో సినిమాను తీర్చిదిద్దుతున్నారు. శివ నిర్వాణ తన మార్కు ఫ్యామిలీ ఎమోషన్స్‌కు రవితేజ మాస్ ఇమేజ్‌ను తోడు చేసి ఈ కథను సిద్ధం చేశారట. మొత్తానికి ‘ఇరుముడి’ సినిమాతో మాస్ మహారాజా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడానికి సిద్ధమవుతున్నారు. పక్కా కమర్షియల్ హంగులతో వస్తున్న ఈ సినిమా రవితేజ కెరీర్‌లో ఒక స్పెషల్ మూవీగా నిలవబోతోందట.

Next Story