Chalapathi Rao :తండ్రి చలపతిరావు‌తో రవిబాబు స్పెషల్ వీడియో..

by Mallepaka Hamsa |   (  Updated:2022-12-25 08:29:22  IST  )

టాలీవుడ్ సీనియర్ నటుడు చలపతి రావు ఆదివారం తెల్లవారుజామున మరణించిన విషయం తెలిసిందే..

Chalapathi Rao :తండ్రి చలపతిరావు‌తో రవిబాబు స్పెషల్ వీడియో..
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ సీనియర్ నటుడు చలపతి రావు ఆదివారం తెల్లవారుజామున మరణించిన విషయం తెలిసిందే. 1200 లకు పైగా సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఎన్టీ రామారావుతో అత్యధిక సినిమాల్లో నటించిన వ్యక్తిగా చలపతి రావు నిలిచారు. 1966లో ఇండస్ట్రీకి వచ్చి అప్పటి నుండి విరామం లేకుండా అనేక చిత్రాల్లో నటించారు. తాజాగా, సోషల్ మీడియాలో చలపతిరావుకు సంబంధించిన ఓ స్పెషల్ వీడియో చక్కర్లు కొడుతుంది. ఆయన కుమారుడు రవిబాబుతో ఉన్నారు. అందులో రవిబాబు ఏడుస్తుంటాడు. అప్పుడు ఏం జరిగిందో అని చలపతిరావు ఆశ్చర్యపోతారు. ఆ వెంటనే సరదాగా రవిబాబు కేసు తినడం అందరినీ ఆనందానికి గురిచేస్తుంది. అది చూసిన చలపతిరావు తల కొట్టుకుంటారు. ఈ వీడియో చలపతిరావు క్యారంటైన్‌లో ఉన్న సమయంలోనిదని తెలుస్తోంది.

Next Story