క్రైమ్ థ్రిల్లర్ గ్లింప్స్‌తో వణుకుపుట్టేలా చేసిన రవిబాబు.. వైరల్‌గా మారిన షాకింగ్ వీడియో

by Mallepaka Hamsa |

టాలీవుడ్ నటుడిగా, దర్శకుడిగా రవిబాబు (Ravi Babu)మంచి గుర్తింపు దక్కించుకున్నారు.

క్రైమ్ థ్రిల్లర్ గ్లింప్స్‌తో వణుకుపుట్టేలా చేసిన రవిబాబు.. వైరల్‌గా మారిన షాకింగ్ వీడియో
X

దిశ, సినిమా: టాలీవుడ్ నటుడిగా, దర్శకుడిగా రవిబాబు (Ravi Babu)మంచి గుర్తింపు దక్కించుకున్నారు. పలు చిత్రాల్లో విలన్‌గానూ నటించి మెప్పించారు. విభిన్న కథలు ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్న ఆయన కొద్ది కాలంగా సినిమాలకు దూరం అయ్యారు. ఇప్పుడు మళ్లీఓ వైల్డ్ క్రైమ్ థ్రిల్లర్‌తో రాబోతున్నారు. చాలా కాలం తర్వాత ఆయన వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో, ఫ్లయింగ్ ఫ్రాగ్స్ బ్యానర్‌పై రాబోతున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ గ్లింప్స్‌తో రవిబాబు జనాలకు వణుకుపుట్టేలా చేశారు.

ఈ చిత్రానికి ‘రేజర్’(Razor ) టైటిల్ ఫిక్స్ చేయగా.. ఇందులో న్యాయం కోసం రవిబాబు ఎంతటి దారుణానికైనా ఒడిగట్టే పాత్రలో కనిపించి అందరిలో అంచనాలను రెట్టింపు చేశారు. ముందుగా.. ముగ్గురు నిందితులను అత్యంత క్రూరంగా చంపేస్తున్న విజువల్స్ చూస్తే ఎవరైనా ఉలిక్కి పడాల్సిందే. ఒకరి తల తీయగా.. మరొకరి కాళ్లు మొండాన్ని వేరు చేశారు. అలాగే మరో వ్యక్తి చేతులు మొండాన్ని వేరు చేసి రవిబాబు రక్తం కారుతున్న పెద్ద కత్తితో కనిపించారు. ఈ గ్లింప్స్ అందరినీ భయంకరంగా ఉండి జనాల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. గ్లింప్స్ చూస్తుంటే.. రవిబాబు ఈసారి రూట్ మార్చి చాలా వయలెంట్‌ చిత్రాన్ని తీసుకురాబోతున్నట్లు అర్థమవుతోంది. అది చూసిన వారు షాక్ అవుతున్నారు. ప్రస్తుతం ‘రేజర్’ సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.

link

Next Story