ఎయిరిండియా సిబ్బందిపై రవీనా టాండన్ షాకింగ్ పోస్ట్.. నెటిజన్ల రియాక్షన్ ఏంటంటే?

by Mallepaka Hamsa |   (  Updated:2025-06-16 12:46:35  IST  )

గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌(Ahmedabad)లో జూన్ 12న జరిగిన విమాన ప్రమాదంలో 241 మంది చనిపోగా ఒకే ఒక వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు.

ఎయిరిండియా సిబ్బందిపై రవీనా టాండన్ షాకింగ్ పోస్ట్.. నెటిజన్ల రియాక్షన్ ఏంటంటే?
X

దిశ, సినిమా: గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌(Ahmedabad)లో జూన్ 12న జరిగిన విమాన ప్రమాదంలో 241 మంది చనిపోగా ఒకే ఒక వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే ఈ విమానం మెడికల్ కాలేజ్‌పై పడటంతో చివరి అంతస్థులో ఉన్న ఎంతో మంది విద్యార్థులు భోజనం చేయడానికి వెళ్లగా దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఒక్కసారిగా విమానాల్లో ప్రయాణించే వారిని ఉలిక్కిపడేలా చేసింది. ఇక దీనిపై రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీలు ఈ సంఘనటపై సంతాపం వ్యక్తం చేశారు. ఈ విషాద ఘటన తర్వాత పలు ఎయిరిండియా విమానాల్లోనూ పలు సాంకేతిక సమస్యలు ఏర్పడినట్లు వార్తలు వచ్చాయి. అలాగే ఎయిరిండియా చెందిన విమానాలపై సోషల్ మీడియాలో పలు విమర్శలు తలెత్తుతున్నాయి ఈనేపథ్యంలో.. తాజాగా, రవీనా టాండన్ (Raveena Tandon) ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఎయిరిండియా సిబ్బందిపై ప్రశంసలు కురిపిస్తూ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది.

విమానంలో ప్రయాణించిన ఆమె బాధలో కూడా వారు నవ్వుతూ స్వాగతించడంతో వారి సేవలకు ఫిదా అయిపోయింది. ఈ మేరకు ‘‘కొన్ని ప్రారంభాలు అన్ని అడ్డంకులను తట్టుకుని ఉండాలి. ప్రస్తుతం ఎయిరిండియా సిబ్బంది అహ్మదాబాద్ సంఘటన వల్ల బాధలో ఉన్నప్పటికీ కొత్త సంకల్సం కోసం చిరునవ్వుతో ప్రయాణికులను స్వాగతిస్తున్నారు. సిబ్బంది, ప్రయాణికుల మధ్య ఏదో తెలియని బంధం ఏర్పరుచుకున్నారనిపిస్తోంది. ఈ విషాదంలో తమ ప్రియమైన వారికి కోల్పోయిన కుటుంబాలకు సంతాపం తెలుపుతున్నాను. ఇది ఎప్పటికీ నయం కానీ గాయం.. ఎయిరిండియా ఎల్లప్పుడూ ఇలాంటి వాటిని అధిగమించి మళ్లీ బలంగా నిలబడాలనేదే వారి సంకల్పం’2 అని రాసుకొచ్చింది. అలాగే ఎయిరిండియా ఫ్లైట్‌లో వీండో సీట్ వల్ల కూర్చున్న ఫొటోలను షేర్ చేసింది. ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు కొందరు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మరికొందరు మాత్రం నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు.

instagram link

Next Story