- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాలీవుడ్ హీరోయిన్ కూతురు టాలీవుడ్ ఎంట్రీ ఖరారు.. స్టార్ కిడ్ సరసన బంపర్ ఆఫర్ అందుకుందిగా!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రవీనా టాండన్(Raveena Tandon) కూతురు రాషా తడాని(Rasha Thadani) అందరికీ సుపరిచితమే.

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రవీనా టాండన్(Raveena Tandon) కూతురు రాషా తడాని(Rasha Thadani) అందరికీ సుపరిచితమే. గాయనిగా తన గొంతుతో ఎంతోమందిని మంత్రముగ్ధులను చేసింది. ఫుల్ పాపులారిటీ దక్కించుకున్న ఈ అమ్మడు ‘ఆజాద్’ (Azad)సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. తొలి ప్రాజెక్ట్‌లోనే తన అందం, హావభావాలు, డ్యాన్స్‌తో ప్రేక్షకులన మనసులు గెలుచుకుని ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది. ఒక్క మూవీతోనే తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్‌ను రాబట్టుకుంది. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతుంది.
ఇందులో ఘట్టమనేని వారసుడు రమేష్ బాబు తనయుడు జయ కృష్ణ (Jaya Krishna)హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాతో ఆయన సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తుండటం విశేషం. ఈ చిత్రానికి అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు. లవ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కుతుండగా.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ అక్టోబర్ 15 నుంచి మొదలు కాబోతున్నట్లు టాక్. ఇక ఇందులో రాషా తడానీ పాల్గొనబోతున్నట్లు ఈ ప్రాజెక్ట్ విషయంలో ఆమె చాలా ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.






