ఆ విషయంలో నేను బాధితురాలినే.. KGF నటి సంచలన వ్యాఖ్యలు..!!

by Dishafeatures2 |
ఆ విషయంలో నేను బాధితురాలినే.. KGF నటి సంచలన వ్యాఖ్యలు..!!
X

దిశ, వెబ్ డెస్క్: 90వ దశకంలో అందం, అభినయంతో బాలీవుడ్ ను ఓ ఊపు ఊపిన తారల్లో రవీనా టాండన్ ఒకరు. 'టిప్ టిప్ బర్సా పానీ' అనే పాటలో తన అందం, డ్యాన్స్ తో రవీనా కుర్రకారును ఉర్రూతలూగించారు. ఈ సూపర్ హిట్ సాంగ్ ను హీరో అక్షయ్ కుమార్, బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ సూర్యవంశీ అనే మూవీలో రీమేక్ చేశారు. కాగా ఇటీవలే ఈ వెటరన్ బ్యూటీ కేజీఎఫ్ 2 లో ఓ ముఖ్య పాత్రలో నటించారు. ఇక విషయానికొస్తే.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ కేజీఎఫ్ నటి సంచలన విషయాలు బయటపెట్టారు. తాను కూడా బాడీ షేమింగ్ బాధితురాలినేనని చెప్పుకొచ్చారు. 90వ దశకంలో కొన్ని మ్యాగజైన్లు లేడీ యాక్టర్లను కించపరిచేలా గాసిప్స్ రాసేవని చెప్పారు. ఆ వార్తలు రాసేవారు మహిళలు కావడం చాలా దురదృష్టకరమని రవీనా ఆవేదన వ్యక్తం చేశారు.


మహిళా యాక్టర్స్ ను బాడీ షేమింగ్ చేస్తూ కించపరిచేవారని, అలాగే సాటి మహిళలు అని కూడా చూడకుండా లేడీ యాక్టర్లపై అశ్లీల వార్తలు రాస్తూ.. వాళ్ల ప్రతిష్టను దెబ్బ తీసేవారని వాపోయారు. ఈ క్రమంలోనే ఓసారి తనపై కూడా బాడీ షేమింగ్ కు పాల్పడ్డారని ఈ వెటరన్ బ్యూటీ చెప్పుకొచ్చారు. '' నాకు లావైన తొడలు ఉన్నాయని( ఐ వజ్ కాల్డ్ థండర్ థైస్) ఇష్టమొచ్చినట్లు మ్యాగజైన్ లో రాసేవారని బాధపడ్డారు. కానీ మహిళలను ఆ విధంగా కించపరిచిన వాళ్లే ఇవాళ స్త్రీవాదులుగా, మహిళా హక్కుల పరిరక్షకులుగా సమాజంలో ఫోజు కొడుతున్నారని రవీనా మండిపడ్డారు.

"I was called thunder thighs", Raveena Tandon on being body-shamed in Bollywood


Next Story

Most Viewed