రేప్ సన్నివేశాలపై రవీనా టాండన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Disha Web Desk 10 |
రేప్ సన్నివేశాలపై రవీనా టాండన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: సినిమాల్లో రేప్ సన్నివేశాల గురించి రవీనా టాండన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. తను నటించిన కొన్ని చిత్రాల్లో అసౌకర్యంగా ఫీల్ అయిన సీన్ల గురించి చెబుతూ రేప్ సన్నివేశాల్లో మాత్రం తప్పకుండా షరతులు విధించేదాన్నని తెలిపింది. అయితే ఒక చిత్రంలో స్విమ్మింగ్ కాస్ట్యూమ్ ధరించడంతోపాటు ముద్దు సన్నివేశాలు చేయడానికి నిరాకరించినప్పుడు తనను అహంకారి అని పిలిచారని గుర్తుచేసుకుంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'ఏ చిత్రంలో కిస్ సీన్లు చేయలేదు. రొమాంటిక్ సీన్లలో నా బట్టలు చిరుగులు లేకుండా ఉండాల్సిందే. అందుకే నన్ను ఆ విషయంలో 'ఏకైక నటి'గా గుర్తిస్తారు. అలాగే ఇటీవల మగాళ్లు మహిళలను బాడీ‌షేమ్‌కు గురిచేస్తుంటే.. ఇతర స్త్రీలు సపోర్ట్ చేయకపోగా శత్రువుగా మారడం బాధాకరం. ఎందుకంటే తమకు పోటీ లేకుండా దెబ్బకొట్టేందుకు బాడీ-షేమ్, స్లట్-షేమ్ చేస్తారు. అంతేకాదు 90ల నాటి జర్నలిజం దుర్మార్గం పట్ల కూడా నేను అసంతృప్తి చెందాను. ఒక మూవీలో హీరో జిప్పర్‌ని క్రిందికి లాగి అండర్ వేర్ పట్టీ చూపించిన ఒక సన్నివేశం నన్ను బాధపెట్టింది' అంటూ వివరించింది.

ఇవి కూడా చదవండి : హెచ్చరిక: సైలెంట్‌గా చంపేస్తున్న నడుము నొప్పి.. క్యాన్సర్‌‌కు సంకేతం!!

Next Story

Most Viewed