ఇది నమ్మశక్యంగా లేదు.. పద్మశ్రీపై Raveena Tandon

by Hajipasha |   (  Updated:2023-01-26 14:02:54  IST  )

పద్మశ్రీ అవార్డు లభించడంపై నటి రవీనా టాండన్ ఎమోషనల్ అయింది.

ఇది నమ్మశక్యంగా లేదు.. పద్మశ్రీపై Raveena Tandon
X

దిశ, సినిమా: పద్మశ్రీ అవార్డు లభించడంపై నటి రవీనా టాండన్ ఎమోషనల్ అయింది. ముందుగా తన పేరు లిస్టులో ఉందని సదరు నిర్వాహకులు చెప్పినపుడు 'ఏమిటి? నిజమేనా? మీరు సరిగ్గా చూశారా? లేక తమాషా చేస్తున్నారా?' అని ఆశ్చర్యంగా అడిగినట్లు చెప్పింది. అంతేకాదు ఈ వార్త విన్నప్పుడు కూడా తన మనసు నమ్మడానికి సిద్ధంగా లేదని, ఊహించని శుభవార్తపై ఎలా స్పందించాలో కూడా తెలియలేదని భావోద్వేగానికి గురైంది. 'ఇన్నాళ్లకు నా ప్రతిభ గుర్తించబడింది. కొన్ని సార్లు నన్ను ఎవరూ ఇష్టపడరని అనుకుంటా. మరికొన్నిసార్లు విశ్వంలో ఎక్కడో ఒక్కరైనా నన్ను గుర్తించరా అని ఆలోచిస్తా. ప్రతి విషయంలోనూ చాలా తటస్థంగా ఉంటా. ప్రజల ప్రేమ వల్లే నేను ఇన్నేళ్లుగా ఇండస్ట్రీలో నిలదొక్కుకుని నిలబడ్డాను. ఇది నాకు అవార్డుల సంవత్సరం. సామాజిక సేవ కారణంగానే ఇక్కడ ఒక ప్రతినిధిగా ఉన్నా. నా కళను గుర్తించి పద్మశ్రీ అందించినందుకు చాలా సంతోషిస్తున్నా. ఇది నిజంగా ప్రత్యేకమైనది. ప్రజలందరికీ ధన్యవాదాలు' అంటూ ఉద్వేగానికిలోనైంది.

ఇవి కూడా చదవండి: 'సోదర సోదరీమణులారా' ఫస్ట్ లుక్ విడుదల!

Next Story