Ravi Teja’s Ravanasura is now streaming on OTT platform :ఓటీటీలోకి రావణాసుర. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

by Dishanational2 |
Ravi Teja’s Ravanasura is now streaming on OTT platform :ఓటీటీలోకి రావణాసుర. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
X

దిశ, వెబ్‌డెస్క్ : ఎన్నో అంచనాలతో రిలీజైన మాస్ మహారాజ రవితేజ రావణాసుర సినిమా థియేటర్లలో రిలీజై, ప్లాప్ టాక్ తీసుకొచ్చుకున్న విషయం తెలిసిందే. ధమాకాతో మంచి హిట్ అందుకున్న ఈ హీరో రావణాసుర కూడా మంచి సక్సెస్ సాధిస్తుందని ఆశగా ఎదురుచూశాడు. కానీ ఆ రేంజ్‌లో సినిమా సక్సెస్ కాలేదు. రవితేజ తన క్యారెక్టర్‌లో జీవించినప్పటికీ,కథ కొత్తగా ఉన్న కథనం ఆసక్తిగా లేదని పలువురు సినీ అభిమానులు అభిప్రాయపడ్డారు.

ఇక ఈ మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని రవితేజ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కాగా, ఈ మూవీ సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిదంట. గత అర్ధరాత్రి నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్‌ అవుతోంది. ముందస్తు అనౌన్స్‌మెంట్‌ లేకుండానే ఈ సినిమా సైలెంట్‌గా ఓటీటీలోకి రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

Read more:

పవన్ కల్యాణ్‌ను అడ్డంగా బుక్ చేయనున్న రేణు దేశాయ్.. ‘కమింగ్ సూన్’ అంటూ సంచలన వీడియో

Next Story