- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పిల్లలను కనేందుకు ప్లాన్ చేసుకుంటున్నా.. అందుకే ఈ జాగ్రత్తలంటూ రష్మిక షాకింగ్ కామెంట్స్!
నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) త్వరలోనే తెలుగు వారింటికి కోడలుగా వెళ్లబోతున్నట్లు పలు వార్తలు వైరల్ అవుతున్నాయి.

దిశ, సినిమా: నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) త్వరలోనే తెలుగు వారింటికి కోడలుగా వెళ్లబోతున్నట్లు పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. గత కొద్ది కాలంగా రష్మిక, విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)ఇటీవల ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్లు సమాచారం. అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి నిశ్చితార్థం జరగ్గా.. ఈ విషయంపై ఈ జంట ఎలాంటి పోస్ట్ పెట్టకపోవడం గమనార్హం. అయినప్పటికీ వీరిద్దరి ఎంగేజ్‌మెంట్‌కు, పెళ్లికి సంబంధించిన వార్తలెన్నో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇక ఇటీవల ఈ విషయంపై రష్మికకు ప్రశ్న ఎదురవగా.. మీకు తెలియాల్సినప్పుడే తెలుస్తుంది.. నేను కూడా త్వరలో ప్రకటిస్తానంటూ షాకిచ్చింది.
తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక ఇప్పటి నుంచే పిల్లల కోసం కనేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడించి అందరికీ షాకిచ్చింది. ‘‘నేను ఇంకా తల్లిని కాలేదు. కానీ నాకు పిల్లలు పుడతారని తెలుసు. వారి కోసం నేను ఇప్పటినుంచే ఆలోచిస్తున్నాను. సురక్షితంగా ఉండాలని వారికి మంచి జీవితం ఇవ్వాలని కోరుకుంటున్నాను. వారి కోసం నేను ఏదైనా చేయడానికి ఫిట్‌గా ఉండాలనుకుంటున్నాను. అందుకే పనిగంటల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఓవర్ వర్క్ చేయడం గొప్ప విషయం కాదు.
మాకూడా ఇప్పటినుంచి ఫిక్స్‌డు టైమింగ్స్ ఉండాలని కోరుకుంటున్నాను. మిగతా టైమ్ ఫ్యామిలీతో, హెల్త్‌కి కేటీయించాలనుకుంటున్నాను. అలాగే ఫిట్‌గా ఉండేందుకు వర్కౌట్ చేయాలనుకుంటున్నాను. ఇలా చేస్తే భవిష్యత్తులో పశ్చాత్తాప పడాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకుంటున్నాను’’ అని చెప్పుకొచ్చింది. దీంతో ఈ విషయం తెలుసుకున్న వారంతా విజయ్‌తో నిశ్చితార్థం జరగడం నిజమే అని వాదిస్తున్నారు. ఈ కామెంట్స్‌తో రష్మిక హింట్ ఇచ్చిందని పలు రకాలుగా చర్చించుకుంటున్నారు.






