- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నమ్మడానికి కష్టంగా ఉన్నా ఇదే నిజమంటూ రష్మిక ఇంట్రెస్టింగ్ పోస్ట్
నేషనల్ క్రష్ రష్మిక(Rashmika Mandanna), విజయ్ (Vijay Deverakonda)ప్రేమించుకుంటున్నట్లు ఎన్నో రోజులుగా వార్తలు వస్తున్నాయి.

దిశ, సినిమా: నేషనల్ క్రష్ రష్మిక(Rashmika Mandanna), విజయ్ (Vijay Deverakonda)ప్రేమించుకుంటున్నట్లు ఎన్నో రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇటీవల వీరిద్దరు ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకోగా.. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి బంధంతో ఒక్కటికాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్ని వార్తలు వచ్చినప్పటికీ ఈ విషయంపై విజయ్, రష్మిక మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. అలాగే ఈ వార్తలపై కూడా స్పందించలేదు. దీంతో అంతా నిజమా, కాదా? అనే అనుమానంలో పడిపోయారు. నాగచైతన్య, శోభితలాగా షాకిస్తారా అని గుసగుసలాడుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో.. రష్మికకు శుభాకాంక్షలు చెప్తూ.. విజయ్ పోస్ట్ పెట్టడం చర్చకు దారితీస్తోంది. ‘ది గర్ల్ ఫ్రెండ్’ విడుదలగా.. అందరూ చూడాలని తన ఫ్యాన్స్‌కు కీలక విజ్ఞప్తి చేశారు. ‘‘నాకు తెలుసు వాళ్ళు ఏదో శక్తివంతమైన, ముఖ్యమైన, నమ్మడానికి కష్టంగా అనిపించే సినిమా చేశారని. అందరు నటుల పెర్ఫార్మెన్స్ అత్యున్నత స్థాయిలో ఉంటుందని నమ్ముతున్నాను. అది ఆడియన్స్ పై మంచి ప్రభావం చూపబోతోందని అనుకుంటున్నాను. రేపు మనమందరం ది గర్ల్ ఫ్రెండ్ సినిమాతో ఇది జరగడం చూస్తాము. అందరూ థియేటర్ కి వెళ్లి ఈ సినిమా చూడండి’’ అని పెట్టాడు.
ఇక దానికి రష్మిక స్పందిస్తూ.. ‘‘అవును ది శక్తివంతమైనది, ముఖ్యమైనది, నమ్మడానికి కష్టంగా ఉన్నప్పటికీ ఇదే నిజం. అయినప్పటికీ మీరు బాగా చెప్పారు. ఇది చాలా కాలం పాటు గుర్తుంటుంది. ముందు నుంచే ఈ సినిమాలో మీరు భాగం అయ్యారు నాకు చాలా సంతోషంగా ఉంది. నా విషయంలో మీరు కచ్చితంగా ఈ మూవీ చూశాక గర్వపడతారు’’ అని రిప్లై ఇచ్చింది. దీంతో వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలకు బలం చేకూరినట్లు అయింది.






