- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెళ్లై నెల రోజులు కూడా కాకముందే షాకిచ్చిన రష్మిక.. వైరల్‌గా మారిన ఇన్‌స్టా పోస్ట్
అయితే పెళ్లి సందడి ముగిసి, హనీమూన్ నుంచి తిరిగి వచ్చారు. ఇక పెళ్లై నెల రోజులు కూడా గడవకముందే రష్మిక మళ్ళీ షూటింగ్స్‌లో బిజీ అయిపోవడం అందరినీ షాక్‌కు గురి చేస్తోంది.

దిశ, సినిమా: టాలీవుడ్ సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. అయితే పెళ్లి సందడి ముగిసి, హనీమూన్ నుంచి తిరిగి వచ్చారు. ఇక పెళ్లై నెల రోజులు కూడా గడవకముందే రష్మిక మళ్ళీ షూటింగ్స్‌లో బిజీ అయిపోవడం అందరినీ షాక్‌కు గురి చేస్తోంది. తన ప్రొఫెషన్ పట్ల ఆమెకు ఉన్న అంకితభావం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. సాధారణంగా పెళ్లైన హీరోయిన్లు పెళ్లి తర్వాత కొన్నాళ్లపాటు విరామం కోరుకుంటారు. కానీ రష్మిక మందన్న మాత్రం అప్పుడే షూటింగ్ సెట్స్‌లో ప్రత్యక్షమయ్యారు.
తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘వేట మొదలైంది’ అనే క్యాప్షన్‌తో ఓ ఫోటోను షేర్ చేశారు. ప్రస్తుతం ఆమె నటిస్తున్న ‘మైసా’ చిత్రానికి సంబంధించిన కీలకమైన యాక్షన్ సీక్వెన్స్‌లో ఆమె పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. రిస్క్‌తో కూడిన ఫైట్ సీన్లలో కూడా రష్మిక వెనకాడకుండా నటిస్తుండటంతో చిత్ర యూనిట్ ఆమె డెడికేషన్‌ను మెచ్చుకుంటోంది. ఒకవైపు వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తూనే, మరోవైపు కెరీర్‌ను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా రష్మిక దూసుకుపోతున్నారు. నేషనల్ క్రష్ స్థాయి నుంచి గ్లోబల్ స్టార్‌గా ఎదిగే క్రమంలో ఆమె పడుతున్న శ్రమ చూసి అభిమానులు మురిసిపోతున్నారు.
పెళ్లి తర్వాత ఆమె స్పీడ్ చూస్తుంటే, త్వరలోనే మరిన్ని భారీ ప్రాజెక్టులతో రష్మిక మందన్న బాక్సాఫీస్ వద్ద సందడి చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ‘మైసా’ విషయానికొస్తే.. ఈ సినిమాను రవీంద్ర పుల్లె దర్శకత్వం వహిస్తున్నారు. ఈ పాన్ ఇండియా పీరియాడిక్ యాక్షన్ డ్రామా గోండ్ జాతి నేపథ్యంలో సాగే ఎమోషనల్ అండ్ యాక్షన్ థ్రిల్లర్. ఇందులో రష్మిక ఒక తెగ మహిళగా కనిపించనుంది. జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే థియేటర్స్‌లోకి రాబోతుంది.






