- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రష్మిక మందన్న ‘ది గర్ల్‌ఫ్రెండ్’ మూవీ నుంచి బిగ్ అప్డేట్ ఇచ్చిన చిత్రబృందం.. పోస్టర్ అదిరిపోయిందంతే!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మికా మందన్న(Rashmika Mandanna) వరుస హిట్స్‌తో ఇండస్ట్రీని షేక్ చేస్తోంది.

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మికా మందన్న(Rashmika Mandanna) వరుస హిట్స్‌తో ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. ఇటీవల ఛావా, పుష్ప-2, కుబేర వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్‌ను తన ఖాతాలో వేసుకుని ఫుల్ ఫామ్‌లో ఉంది. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ అవకాశాలు అందుకుంటూ తెలుగు, హిందీ, తమిళ భాషల్లో భారీ ప్రాజెక్ట్స్ చేస్తోంది. రష్మిక నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది గర్ల్‌ఫ్రెండ్’(The Girlfriend). ఇందులో టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి(Dixit Shetty) హీరోగా నటిస్తుండగా.. ఈ చిత్రాన్ని రాహుల్ రవీంద్రన్(Rahul Ravindran) తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మిస్తున్నారు.
బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈక్రమంలో.. తాజాగా, ‘ది గర్ల్‌ఫ్రెండ్’ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ సింగిల్ నదివే, నదియే. నిలవే.. స్వరావే అని సాగే పాట జూలై 16న రాబోతున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా రష్మిక, దీక్షిత్ పోస్టర్‌ను షేర్ చేశారు. ఇక ఇందులో వీరిద్దరు కళ్లలో కట్టుపెట్టి చూసుకుంటూ చేతులు పట్టుకుని కింద కూర్చుంటున్నట్లుగా స్టిల్ ఇచ్చారు. ఇక ఈ పోస్ట్‌కు ‘‘మీ ఆత్మలో ప్రతిధ్వనిస్తోంది’’ అనే క్యాప్షన్ జత చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజన్లు పోస్టర్ అదిరిపోయిందని కామెంట్లు చేస్తున్నారు.






