- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అలాంటి పోస్ట్ పెట్టి చిక్కుల్లో పడిన రష్మిక మందన్న.. అక్కడ ‘కుబేర’ సినిమా బ్యాన్ చేయనున్నారా?
నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) గురించి ఎంత చెప్పినా తక్కువే.

దిశ, సినిమా: నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) గురించి ఎంత చెప్పినా తక్కువే. ‘ఛలో’ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చిన ఆమె అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఫేమ్ తెచ్చుకుని వరుస మూవీస్‌తో ఫాలోయింగ్‌ను పెంచుకుంది. తెలుగు, తమిళ, హిందీ స్టార్ హీరోల సరసన నటించిన ఆమె నేషనల్ క్రష్‌గా మారిపోయింది. ఇక ‘పుష్ప’ మూవీతో రష్మిక రేంజ్ ఒక్కసారిగా మారిపోయిందనడంలో అతిశయోక్తి లేదు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులను ఫిదా చేయడంతో పాటు రష్మిక నటనకు ఎంతోమంది మంత్రముగ్దులయ్యారు. అయితే యానిమల్, పుష్ప-2, ఛావా వంటి మూవీస్‌తో వరుస హిట్స్ సాధించిన రష్మిక ‘కుబేర’ (kubera) తో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ జూన్ 20న థియేటర్స్‌లోకి రాబోతుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీ అయిపోయిన రష్మిక ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టింది. తాను చెన్నైకి ప్రత్యేక స్థానం ఇస్తానని అనడంతో అది కాస్త వివాదానికి దారితీసింది. తన బాల్యం కూడా చెన్నైలోనే గడిచిందంటూ చెప్పడంతో కొందరు కన్నడిగులు ఆగ్రహం తెప్పించింది. పుట్టి పెరిగింది.. చదువుకున్నదంతా కర్ణాటకలో అయితే చెన్నై అంటుందని విమర్శలు చేస్తున్నారు. ఆమెది చెన్నై అన్నట్లుగా పెట్టిన పోస్ట్ కన్నడిగులకు కోపం తెప్పిస్తోంది.
అయితే రష్మిక ఈ పోస్ట్ ఏ ఉద్దేశంతో పెట్టినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చర్చనీయాంశంగా మారింది. ఇక ఇటీవల ఇలాగే కమల్ హాసన్ కన్నడ భాషపై చేసిన కామెంట్లు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఆయన క్షమాపణలు చెప్పకపోవడంతో ‘థగ్‌లైఫ్’ సినిమా విడుదలను కన్నడ భాషలో విడుదల కాకుండా చేశారు. ఇక ఇప్పుడు రష్మికకు కూడా అదే పరిస్థితి ఎదురు అయ్యే అవకాశం ఉన్నట్లు పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ఒక్క పోస్ట్‌తో రష్మిక చిక్కుల్లో పడింది.






