ఫస్ట్ టైం.. అలాంటి ప్రయోగం చేయబోతున్న రష్మిక.. టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిపోయిందిగా.. ఆ హీరో కోసమేనా??

by Sujitha Rachapalli |   (  Updated:2025-06-03 16:22:01  IST  )

అనుకోకుండా హీరోయిన్‌గా మారిన రష్మిక మందన్నా నేషనల్ క్రష్ అయిపోయింది. పాన్ ఇండియా హీరోయిన్‌గా కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకుంది. వరుస బ్లాక్ బస్టర్స్ సొంతం

ఫస్ట్ టైం.. అలాంటి ప్రయోగం చేయబోతున్న రష్మిక.. టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిపోయిందిగా.. ఆ హీరో కోసమేనా??
X

దిశ, ఫీచర్స్ : అనుకోకుండా హీరోయిన్‌గా మారిన రష్మిక మందన్నా నేషనల్ క్రష్ అయిపోయింది. పాన్ ఇండియా హీరోయిన్‌గా కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకుంది. వరుస బ్లాక్ బస్టర్స్ సొంతం చేసుకుంటూ నంబర్ వన్ కథానాయకురాలిగా దూసుకుపోతుంది. ప్రస్తుతం భారీ ప్రాజెక్ట్స్ కమిట్ అయిన ఈ బ్యూటీ.. ఫస్ట్ టైం స్పెషల్ సాంగ్‌లో కనిపించబోతుంది. మాస్ మసాలా సాంగ్‌తో మెస్మరైజ్ చేయబోతుంది. హై ఎనర్జీ స్పెషల్ డ్యాన్స్ నంబర్‌తో అభిమానులను ఉర్రూతలూగించనుంది. కాగా ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.

యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రాబోతున్న డ్రాగన్ మూవీలో రష్మిక స్పెషల్ సాంగ్‌ చేయనుందనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆమెను డైరెక్టర్ అప్రోచ్ కాగా ఆల్మోస్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు ఇండస్ట్రీ టాక్. వైబ్రెంట్ స్క్రీన్ ప్రజెన్స్, మాసివ్ ఫ్యాన్ బేస్ కలిగిన రష్మిక ఈ సాంగ్‌తో ఫ్రెష్ ఫీల్ తీసుకొస్తుందనే ఉద్దేశంతో మేకర్స్ ఈ డెసిషన్ తీసుకున్నారని తెలుస్తోంది. అయితే కొందరు విశ్లేషకులు మాత్రం ఇది ఐటెమ్ సాంగ్ కాదని సినిమాను హై ఎమోషన్‌లో మలుపు తిప్పే పాట అని, రవి బస్రూర్ ట్రెమండస్ మ్యూజిక్ ఇవ్వబోతున్నట్లు చెప్తున్నారు. ఇక దీనిపై స్పందిస్తున్న నందమూరి అభిమానులు ఎన్ని ఎక్స్‌పెక్టేషన్స్ అయినా పెట్టుకోండి రీచ్ అవుతామని కామెంట్స్ చేస్తున్నారు.

Next Story