అలాంటి క్యారెక్టర్లన్నింటిపై దేవుడు నా పేరే రాశాడు:Rashmika Mandanna

by Kodari Anjali |   (  Updated:2023-10-09 09:42:32  IST  )

‘యానిమల్‌’ మూవీతో మరోసారి బాలీవుడ్‌ ప్రేక్షకులను పలకరించబోతున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్న.. ఇకపై వరుస సినిమాలతో ఆలిండియా మొత్తాన్ని షేక్‌ చేస్తానంటోంది.

అలాంటి క్యారెక్టర్లన్నింటిపై దేవుడు నా పేరే రాశాడు:Rashmika Mandanna
X

దిశ, సినిమా: ‘యానిమల్‌’ మూవీతో మరోసారి బాలీవుడ్‌ ప్రేక్షకులను పలకరించబోతున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్న.. ఇకపై వరుస సినిమాలతో ఆలిండియా మొత్తాన్ని షేక్‌ చేస్తానంటోంది. ‘యానిమల్’ సినిమా షూటింగ్ పూర్తికాగానే శంతరుబెన్ దర్శకత్వంలో ‘రెయిన్‌బో’ అనే లేడీ ఓరియెంటెడ్‌ మూవీ షురూ చేసిన ఆమె తాజాగా ఓ సమావేశంలో మాట్లాడుతూ నిజంగానే ఇప్పుడు తన టైమ్ నడుస్తుందని చెప్పింది. ‘మనం తినే గింజలపై దేవుడు పేర్లు రాస్తాడంటారు కదా..! నన్నడిగితే నటీనటులు పోషించే పాత్రలపై కూడా పేర్లు రాస్తాడు అని బలంగా నమ్ముతాను. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మంచి టైమ్‌ వస్తుంది. ప్రస్తుతం నాకు అదే నడుస్తుంది. ఇక ఎక్కువ సినిమాలు చేస్తున్నానన్న సంతోషం కంటే.. మంచి కథలు దొరుకుతున్నందుకు హ్యాపీగా ఉంది. మొత్తంగా మరో రెండేళ్ల పాటు నా క్యాలెండర్‌ ఖాళీలేనట్లే’ అంటూ ఆసక్తికరంగా చెప్పుకొచ్చింది.


Next Story
null