- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ రూమర్స్‌పై స్పందించిన రష్మిక మందన్న.. ఎవరు ఏమనుకున్నా పట్టించుకోనంటూ షాకింగ్ కామెంట్స్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న(Rashmika Mandanna)ను కన్నడ ఇండస్ట్రీ బ్యాన్ చేసినట్లు పలు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న(Rashmika Mandanna)ను కన్నడ ఇండస్ట్రీ బ్యాన్ చేసినట్లు పలు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. గత రెండు రోజుల నుంచి ఈ వార్తలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఇటీవల విడుదలైన ‘కాంతార: చాప్టర్1’(Kantara: Chapter 1)పై స్పందించకపోవడం వల్లే అని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక ఈ విషయంపై స్పందించింది. ‘‘నా గురించి వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. నన్ను ఏ ఇండస్ట్రీ బ్యాన్ చేయలేదు. ఏ సినిమాను నేను విడుదలైన రెండు, మూడు రోజుల్లో నేను చూడలేను. ‘కాంతార: చాప్టర్1’ కూడా అంతే.. కొన్ని రోజుల తర్వాత చూసి మూవీ టీమ్‌ను అభినందిస్తూ మెసేజ్ చేశాను.
వాళ్లు నాకు ధన్యవాదాలు చెప్పారు. ఇదంతా తెలియని వారు నన్ను బ్యాన్ చేసారనే తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. అందుకే తెర వెనుక ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. మన వ్యక్తిగత జీవితాన్ని కెమెరా ముందుకు తీసుకురాలేం కదా. ఇది కూడా అంతే. నేను ప్రతి విషయాన్ని ఆన్‌లైన్‌లో చెప్పేదాన్ని కాదు. అందుకే ప్రజలు ఏమనుకున్నా పట్టించుకోను. వాళ్లు నా నటన గురించి ఏం మాట్లాడతారు అనేదే నాకు ముఖ్యంగా. నా వ్యక్తిగత జీవితంపై మాట్లాడే వాటిని పరిగణనలోకి తీసుకోను’’ అని చెప్పుకొచ్చింది. కాగా.. ప్రస్తుతం ‘థామా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ హారర్ థ్రిల్లర్‌లో ఆయుష్మాన్ ఖురానా సరసన హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ చిత్రం అక్టోబర్ 21న థియేటర్స్‌లోకి రాబోతుంది.






