Rashmika Mandanna: త్వరలో రష్మిక పొలిటికల్ ఎంట్రీ.. వేణు స్వామి సంచలన కామెంట్స్

by Bhoopathi Nagaiah |   (  Updated:2022-08-30 08:34:21  IST  )

Rashmika Mandanna is set to enter into politics, says Astrologer Venu Swamy| సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలపై వేణు స్వామి చేసే వ్యాఖ్యలు ఒక్కోసారి వివాదాస్పదంగా మారుతాయి. కొందరు సెలబ్రెటీలు ఈయన మాటలను నమ్ముతారు

Rashmika Mandanna: త్వరలో రష్మిక పొలిటికల్ ఎంట్రీ.. వేణు స్వామి సంచలన కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: Rashmika Mandanna is set to enter into politics, says Astrologer Venu Swamy| సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలపై వేణు స్వామి చేసే వ్యాఖ్యలు ఒక్కోసారి వివాదాస్పదంగా మారుతాయి. కొందరు సెలబ్రెటీలు ఈయన మాటలను నమ్ముతారు. ప్రత్యేక పూజలను చేయించుకుంటారు. అయితే, తాజాగా.. రష్మిక మందన కూడా ఈ స్వామితో పూజలు నిర్వహించింది. ఆ ఫొటోలు వీడియోలు బయటకు రాగా అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన రష్మిక పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వేణు స్వామి మాట్లాడుతూ.. హైదరాబాద్‌లోని రష్మిక నివాసంలో నేను ప్రత్యేక పూజలు నిర్వహించాను.

దానితో ఆమె దశ తిరిగింది. ఇప్పుడు ఆమె నేషనల్ క్రష్‌గా మారి.. కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. రష్మిక జాతకరీత్యా మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటుంది. అంతేకాదు.. త్వరలో పొలిటికల్ ఎంట్రీ కూడా ఇస్తారు. కర్ణాటక రాష్ట్రం నుండి కాంగ్రెస్ పార్టీ తరుపున లోక్ సభకు ఎంపీగా ఎంపిక అవుతారు. కాబట్టి రష్మిక ఎంపీ కావడం ఖాయం అంటూ కుండ బద్దలు కొట్టిన్నట్లు చెప్పారు. ఏకంగా ప్లేస్‌తో పాటు చెప్పడంతో ఇప్పుడు ఈ వ్యాఖ్యాలు వైరల్‌గా మారుతున్నాయి. రష్మిక పొలిటికల్ వైపు వెళ్లడం ఏమిటని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు హీరో రక్షిత్ శెట్టితో సెట్ కాదని చెప్పడంతోనే వారు ఇద్దరు విడిపోయారు అని కూడా చెప్పారు స్వామి. ఈ మాటలు బట్టి చూస్తుంటే రష్మిక వేణు స్వామిని బాగా నమ్ముతుందని అర్థమవుతుంది.

ఇది కూడా చదవండి: భర్త మరణం తర్వాత తొలిసారి కెమెరా ముందుకు సీనియర్ హీరోయిన్ (వీడియో)

Next Story