- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విజయ్ - రష్మిక పెళ్లి.. వేదిక ఫిక్స్, ఆ రోజునే ముహూర్తం!
విజయ్ దేవరకొండ ( Vijay Deverakonda), రష్మిక మందన్న ( Rashmika Mandanna) పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అయినట్లు

దిశ, వెబ్ డెస్క్: విజయ్ దేవరకొండ ( Vijay Deverakonda), రష్మిక మందన్న ( Rashmika Mandanna) పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరో మూడు నెలల్లోని ఈ జంట ఒకటి కానుందట. 2026 ఫిబ్రవరి 26వ తేదీన విజయ్, రష్మిక ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు టాలీవుడ్ సర్కిల్స్ లో వార్తలు వస్తున్నాయి. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలస్ లో ( Udaipur Palace) ఈ జంట వివాహం అంగరంగ వైభవంగా చేసేందుకు ఇరు కుటుంబాలు ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.
అయితే దీనిపై అధికారిక ప్రకటన రాలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. అటు ఇప్పటికే విజయ్, రష్మిక నిశ్చితార్థం రహస్యంగా జరిగినట్లు గత నెలలో ఓ న్యూస్ బయటకు వచ్చింది. అక్టోబర్ మూడో తేదీన శుక్రవారం రోజున ఈ జంట ఎంగేజ్మెంట్ చేసుకుందని కూడా ప్రచారం చేశారు. దీనిపై కూడా ఎక్కడ అధికారిక ప్రకటన రాలేదు. కానీ రష్మిక మాత్రం ఇంటర్వ్యూలలో హింట్ ఇచ్చింది. తాను పెట్టుకున్న రింగ్ చాలా స్పెషల్ అంటూ జగపతిబాబు షోలో కూడా వెల్లడించింది. దీంతో త్వరలోనే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని.. ఇద్దరికీ కంగ్రాట్స్ కూడా చెబుతున్నారు అభిమానులు.






