- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అసిస్టెంట్ పెళ్లి వేడుకలో సందడి చేసిన రష్మిక.. బ్లెస్సింగ్స్ ఇవ్వబోతూ..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న రీసెంట్‌గా హైదరాబాద్‌లో జరిగిన ఓ పెళ్లి వేడుకకు హాజరయ్యింది.

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న రీసెంట్‌గా హైదరాబాద్‌లో జరిగిన ఓ పెళ్లి వేడుకకు హాజరయ్యింది. సెలబ్రేటీలకు మేకప్ మొదలు కొని అసిస్టెంట్స్ వరకు ఒక పెద్ద టీమ్ ఉంటుందనే విషయం తెలిసిందే. ఇందులోని సభ్యులను సెలబ్రిటీలు కూడా తమ సొంత ఫ్యామిలీలాగే చూసుకుంటారు. ఈ క్రమంలోనే రష్మిక అసిస్టెంట్ సాయిబాబు వివాహం ఆదివారంనాడు హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు రష్మిక కూడా హాజరై వధూవరులను ఆశీర్వదించింది. అయితే ఈ సందర్భంగా వధూవరులు రష్మిక కాళ్లపై పడి బ్లెస్సింగ్ తీసుకోబోగా ఆమె కాస్త కంగారు పడింది. అనంతరం వారిని ఆశీర్వదించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read More:
అదిరే స్టెప్పులతో అలరించిన అమల.. డ్యాన్స్‌లో ఏమాత్రం తగ్గలే..
Our rashu at Sai Babu wedding ♥️@iamRashmika #Rashmika #RashmikaMandanna pic.twitter.com/IGtAVL0l9g
— RoshSam💌 (@RoshSamLover) September 3, 2023






