విజయ్‌ను చిక్కుల్లోకి నెడుతున్న వారితో రష్మిక డ్యాన్స్.. వైరల్‌గా మారిన వీడియో.. రిలేషన్‌లో గ్యాప్ వచ్చిందా?

by Mallepaka Hamsa |   (  Updated:2025-07-27 09:51:02  IST  )

రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) నటించిన లేటెస్ట్ మూవీ ‘కింగ్‌డమ్’(Kingdom).

విజయ్‌ను చిక్కుల్లోకి నెడుతున్న వారితో రష్మిక డ్యాన్స్.. వైరల్‌గా మారిన వీడియో..  రిలేషన్‌లో గ్యాప్ వచ్చిందా?
X

దిశ, సినిమా: రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) నటించిన లేటెస్ట్ మూవీ ‘కింగ్‌డమ్’(Kingdom). ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి(Gautam Tinnanuri) దర్శకత్వం వహించగా.. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తి కాగా.. ఈ నెల 31న థియేటర్స్‌లోకి రాబోతుంది. ఈ క్రమంలో.. మూవీ మేకర్స్ తిరుపతి వేదికగా ట్రైలర్ లాంచ్ నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే చివరి నిమిషంలో టీమ్‌కు షాక్ తగిలింది. గతంలో విజయ్ దేవరకొండ గిరిజనులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారని క్షమాపణలు కూడా చెప్పలేదని స్థానిక గిరిజనులు మండిపడ్డారు. అంతేకాకుండా పలు విమర్శలు చేయడంతో పాటు విజయ్ సినిమాకు సంబంధించిన ఈవెంట్స్‌ను అడ్డుకుంటామని కూడా హెచ్చరించారు.

ఈ వివాదం కాస్త రోజు రోజుకు ముదరుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా, రష్మికా మందన్న(Rashmika Mandanna), విజయ్‌ని చిక్కుల్లో నెడుతున్న గిరిజనులతో డ్యాన్స్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. తన బాయ్‌ఫ్రెండ్‌పై విమర్శలు చేస్తున్న వారితో సరదాగా పలు స్టెప్స్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అసలు విషయంలోకి వెళితే.. నేషనల్ క్రష్ రష్మిక నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘మైసా’. నేడు ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి. ఈ విషయాన్ని తెలుపుతూ మూవీ టీమ్ పలు వీడియోలను షేర్ చేసింది. అయితే ఈ వేడుకలకు అంతా గిరిజనులే రావడం గమనార్హం.

వారి వేషధారణలో రాగా.. రష్మిక వారితో మాట్లాడటంతో పాటు డ్యాన్స్ చేసింది. దీంతో ఈ మూవీ గిరిజనలు బ్యాక్‌డ్రాప్‌లో రాబోతున్నట్లు చర్చలు మొదలయ్యాయి. అలాగే విజయ్‌ని తప్పుపట్టిన వారితో అంత క్లోజ్‌గా ఉండటంతో వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చినట్లు కూడా అనుకుంటున్నారు. గత కొద్ది కాలంగా డేటింగ్ చేస్తున్న వీరిగ్దరి మధ్య గొడవలు తలెత్తడం వల్లే ఇలా చేసిందని చర్చించుకుంటున్నారు. కాగా, ‘మైసా’ సినిమాకు రవీంద్ర పూలే దర్శకత్వం వహిస్తుండగా.. అన్‌ఫార్ములా ఫిల్మ్స్ నిర్మిస్తోంది. లేడీ ఓరియెంటెడ్ చిత్రంగా తెరకెక్కుతుండగా.. రష్మిక యోధురాలిగా కనిపించనుంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ ఏకంగా ఐదు భాషల్లో విడుదల కానుంది.

Next Story