షిరిడి సాయిబాబా ఆలయంలో దర్శనమిచ్చిన రష్మిక.. అతనితో కలిసి ప్రత్యేక పూజలు (వీడియో)

by Mallepaka Hamsa |   (  Updated:2025-10-15 08:47:43  IST  )

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న(Rashmika Mandanna) గత కొద్ది కాలంగా వార్తల్లో నిలుస్తోంది. ఇటీవల

షిరిడి సాయిబాబా ఆలయంలో దర్శనమిచ్చిన రష్మిక.. అతనితో కలిసి ప్రత్యేక పూజలు (వీడియో)
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న(Rashmika Mandanna) గత కొద్ది కాలంగా వార్తల్లో నిలుస్తోంది. ఇటీవల విజయ్ దేవరకొండ(Vijay Deverakonda)తో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఆమె అధికారికంగా స్పందించలేదు. అయితే ఎన్ని వార్తలు వచ్చినప్పటికీ ఆమె తన పని తాను చేసుకుంటోంది. ఇక ఇటీవల ఓ వీడియోలో మాత్రం స్పెషల్ రింగ్‌తో కనిపించింది. దీంతో అంతా అది ఎంగే‌జ్‌మెంట్ ఉంగరం అని చర్చించుకున్నారు. ఇక విజయ్ మాత్రం నిశ్చితార్థం అయిపోగానే.. తాను ఎంతగానో నమ్మే దేవుడు షిరిడి సాయిబాబాను దర్శించుకున్న విషయం తెలిసిందే. తాజాగా, రష్మిక మందన్న షిరిడి సాయిబాబా ఆలయానికి వెళ్లింది. అయుష్మాన్ ఖురానా(Ayushmann Khurrana)తో కలిసి ప్రత్యేక పూజలు చేసింది.

పింక్ కలర్ డ్రెస్‌లో వెళ్లిన రష్మిక స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా.. రష్మిక మందన్న, అయుష్మాన్ ఖురానా కాంబోలో రాబోతున్న హార్రర్ చిత్రం ‘థామా’ ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మాడాక్ ఫిలిమ్స్ బ్యానర్‌పై దినేష్ విజన్, అమర్ కౌశిక్ నిర్మిస్తున్నారు. ఇక ఇందులో నవాజుద్దీన్ సిద్ధిఖీ, పరుష్ రావల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అక్టోబర్ 21న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రస్తుతం రష్మిక మందన్న ది గర్త్ ఫ్రెండ్, రెయిన్బో, మైసా వంటి చిత్రాల్లో నటిస్తోంది. అలాగే వెంకీ కుడుముల దర్శకత్వంలోనూ ఓ ప్రాజెక్ట్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.

READ MORE ....

అలాంటి సీన్స్ చేయడానికి చాలా భయపడ్డాను..బయటకు చెప్పడానికి కూడా సిగ్గుపడ్డాను: సోనమ్ బజ్వా

Next Story