టిల్లుగాడితో రొమాన్స్‌కు రష్మిక గ్రీన్ సిగ్నల్.. ఆమె డైరెక్షన్‌లోనే సిద్ధు నెక్ట్స్ మూవీ

by Dishanational2 |
టిల్లుగాడితో రొమాన్స్‌కు రష్మిక గ్రీన్ సిగ్నల్.. ఆమె డైరెక్షన్‌లోనే సిద్ధు నెక్ట్స్ మూవీ
X

దిశ, సినిమా: రష్మిక మందన్నా, సిద్ధు జొన్నలగడ్డ జంటగా మూవీ రాబోతున్నట్లు ఓ వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉన్నా ‘డీజే టిల్లు’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన సిద్ధు జొన్నలగడ్డ త్వరలోనే ‘టిల్లు స్క్వేర్’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే దీని తర్వాత సిద్ధు చేతిలో మరో మూడు ప్రాజెక్ట్‌లు ఉన్నట్లు తెలుస్తుండగా.. అందులో ఓ సినిమాలో సిద్ధు సరసన రష్మిక హీరోయిన్‌గా నటించబోతున్నట్లు టాలీవుడ్‌లో టాక్ నడుస్తుంది. అయితే ప్రస్తుతం తెలుగు, తమిళ్, బాలీవుడ్‌లో సినిమాలు చేస్తున్న రష్మిక.. సిద్ధుతో నటించేందుకు ఒప్పుకోవడంపై నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అలాగే వీళ్లిద్దరి కాంబినేషన్ కలిపింది ఒక డెబ్యూ డైరెక్టర్ కావడం విశేషం. టాలీవుడ్ స్టార్ రైటర్ కోన వెంకట్ కుటుంబం నుంచి ఫ్యాషన్ డిజైనర్‌గా పేరుగాంచిన నీరజ కోన.. యువ రచయిత మిథున్ చైతన్య రాసిన కథతో ఈ మూవీని తెరకెక్కించబోతున్నట్లు సమాచారం.

Read More: 'ఓ మై గాడ్‌-2' సినిమాకు కట్స్ విధించిన సెన్సార్‌ బోర్డ్‌

Next Story

Most Viewed